twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thankyou Movie 1st Day Collections: నాగచైతన్య కెరీర్ లోనే దారుణమైన కలెక్షన్స్.. ఇలా ఊహించలేదు!

    |

    నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా శుక్రవారం రోజు భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం రేంజ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది అనుకున్నారు. కానీ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత షాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కలలో కూడా ఊహించని స్థాయిలో థాంక్యూ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజు మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక పెట్టిన పెట్టుబడికి ఇంకా ఎంత వస్తే సక్సెస్ అయినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే..

    మార్కెట్ లో మంచి డిమాండ్

    మార్కెట్ లో మంచి డిమాండ్

    నాగచైతన్య థాంక్యూ సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇంతకుముందే వీరి కలయికలో వచ్చిన మనం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక విధంగా ఈ దర్శకుడికి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక అందులో భాగంగానే థాంక్యూ సినిమాకు దిల్ రాజు ద్వారా మంచి బిజినెస్ అయితే ఏర్పడింది.

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    మొత్తంగా థాంక్యూ సినిమా ఈ విధంగా బిజినెస్ చేసింది. నైజాం ఏరియాల్లో రూ.8 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా సీడెడ్ లో రూ.2.5 కోట్లు ఆంధ్ర మొత్తంలో రూ.9.50 కోట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపు రూ.20 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. ఇక కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో 1.5 ఐదు కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో 2.50 కోట్లకు అమ్ముడైన థాంక్యూ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 24 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమాకు 25 కోట్ల టార్గెట్ సెట్ అయింది.

    ఏపీ తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్

    ఏపీ తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్

    ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు థాంక్యు సినిమా ఈ విధమైన కలెక్షన్స్ అందుకుంది. నైజాం ఏరియాలో రూ.72 లక్షలు, సీడెడ్ లో రూ.20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.22 లక్షలు, ఈస్ట్ రూ.14 లక్షలు వెస్ట్ రూ.8 లక్షలు, గుంటూరులో రూ.10 లక్షలు, కృష్ణ లో రూ.12 లక్షలు, నెల్లూరులో రూ.7 లక్షలు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో థాంక్యూ సినిమా రూ.1.65 కోట్ల షేర్ వసూళ్ళను అందుకుంది. ఇక 2.70 కోట్ల గ్రాస్ వచ్చింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    ఒక విధంగా వర్షాల ప్రభావం కూడా ఈ సినిమాపై గట్టిగానే పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.65 కోట్లు మాత్రమే వచ్చాయి. కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే రూ.6 లక్షలు ఓవర్సీస్ లో రూ.45 లక్షలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా థాంక్యూ సినిమా మొదటి రోజు 2.16 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఇక 3.70 కోట్ల గ్రాస్ దక్కింది.

    ఇంకా ఎంత రావాలంటే..

    ఇంకా ఎంత రావాలంటే..

    థాంక్యూ సినిమా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలయ్యింది. ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 2.16 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే మరో 22.84 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంది. కానీ సినిమా ఆ రేంజ్ లో టార్గెట్ ను పూర్తి చేస్తుంది అనే పరిస్థితి కనిపించడం లేదు.

    వర్షాలతో జనాలు థియేటర్ల వైపు చూడడం లేదు. అంతేకాకుండా సినిమాకు మొదటి రోజు అనుకున్నంతగా పాజిటివ్ టాక్ కూడా పెరిగింది లేదు. మరి థాంక్యూ సినిమా మొత్తంగా ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.

    నాగచైతన్య కెరీర్ డిజాస్టర్ ఓపెనింగ్స్

    నాగచైతన్య కెరీర్ డిజాస్టర్ ఓపెనింగ్స్

    అలాగే నాగచైతన్య గత సినిమాల కంటే కూడా థాంక్యూ సినిమా చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకోవడం షాక్ అనే చెప్పాలి. చివరగా వచ్చిన బంగార్రాజు ఫస్ట్ 9 కోట్ల వసూలను అందుకుంది. ఆ సినిమా లో నాగార్జున ఉన్న విషయం తెలిసింది. అలాగే లవ్ స్టోరీ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 7.13 కోట్లను సాధించింది.

    దానికి శేఖర్ కమ్ముల, సాయి పల్లవి హెల్ప్ అయ్యింది. ఇక ఆ సినిమాల కంటే కూడా థాంక్యూ అతి దారుణమైన కలెక్షన్స్ అందుకోడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. స్టార్స్ ఎవరైనా సరే విభిన్నమైన బలమైన కంటెంట్ తో వస్తేనే సక్సెస్ అవుతారని చెప్పవచ్చు

    English summary
    Naga chaitanya Thankyou Movie 1st Day total box office Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X