నాగచైతన్య కస్టడీ సినిమా బిజినెస్.. ఊహించని స్థాయిలో డిమాండ్ చేస్తున్న నిర్మాత!
ఈ మధ్యకాలంలో యువ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ టాలీవుడ్ లో పాన్ ఇండియా మార్కెట్ పైనే ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా లేదంటే ద్విభాషా చిత్రాలని చేస్తూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అయితే పాన్ ఇండియా మాయలో పడిన హీరోలు కథల విషయం కాస్తా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారేమో అనిపిస్తోంది.
నేటివిటీకి దూరంగా యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలపైన దృష్టి పెడుతున్నారు. అంత వరకు భాగానే ఉంది. కాని కథలో ఎమోషనల్ ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయనే మాట వినిపిస్తోంది. ఇక కొన్ని సినిమాలు అయితే బజ్ లేకపోయిన తమకి మార్కెట్ ఎక్కువ ఉందనో, లేదంటే ద్విభాషా చిత్రం చేసాం కాబట్టి రెండు రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంటుందనో థీయాట్రికల్ బిజినెస్ విషయంలో నిర్మాతలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనే మాట వినిపిస్తోంది.

నాన్ థీయాట్రికల్ రైట్స్, థీయాట్రికల్ రైట్స్ కోసం సినిమా మీద పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. తాజాగా నాగ చైతన్య కస్టడీ బిజినెస్ విషయంలో కూడా నిర్మాత నుంచి ఎక్కువ డిమాండ్ ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
మొదటిసారి నాగ చైతన్య కానిస్టేబుల్ రోల్ ఇందులో పోషించారు. అయితే ఈ మూవీ కోసం ఏకంగా 25 కోట్ల థీయాట్రికల్ రైట్స్ కోసం డిమాండ్ చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. అది కూడా ఒక తెలుగు తెలుగు రాష్ట్రాలలోనే ఈ మేరకు బిజినెస్ ని నిర్మాతలు ఆశిస్తున్నారు. మూవీ కూడా నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక వెంకట్ ప్రభు, అరవింద్ స్వామికి తమిళంలో మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ కూడా మంచి బిజినెస్ జరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే సినిమాపై ఇప్పటి వరకు పెద్దగా బుజ్ అయితే లేదు. ప్రేక్షకులకి రీచ్ అయ్యే విధంగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. టీజర్, సాంగ్స్ వచ్చిన ఆకట్టుకునే విధంగా లేవు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 15 కోట్ల లోపే డీల్ క్లోజ్ చేసుకుంటే బెటర్ అనే విధంగా చర్చలు జరుపుతున్నారు. మరి ఇలాంటి సమయంలో నిర్మాత ఆశించే స్థాయిలో బిజినెస్ జరుగుతుందా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











