Custody Pre Release Bussiness: నాగచైతన్య ముందు బిగ్ టార్గెట్.. లాభాల్లోకి రావాలంటే!
క్లాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న నాగచైతన్య అప్పుడప్పుడు మాస్ యాక్షన్ సినిమాలు కూడా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ రూట్లో మాత్రం ఇంతవరకు నాగచైతన్యకు సరైన సక్సెస్ రాలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా కస్టడీ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని సిద్ధమవుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా మార్కెట్లో మంచి బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సక్సెస్ కావాలి అంటే బ్రేక్ ఈవెన్ ఎంత అవ్వాలి అనే వివరాల్లోకి వెళితే..
కస్టడీతో హిట్టు అవసరం : కస్టడీ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని నాగచైతన్య ఎంతో పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఎందుకంటే నాగచైతన్య చివరగా చేసిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ సినిమాపై నిర్మాత పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి రాలేదు. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకుని నాగచైతన్యతను మార్కెట్ స్థాయిని కూడా పెంచుకోవాలని అనుకుంటున్నాడు.

పవర్ఫుల్ విలన్ రోల్ : కస్టడీ సినిమాకు మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. సినిమాలో నాగచైతన్య ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఇక సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ తో సినిమా పాయింట్ అయితే జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక థియేటర్లో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.


మిగతా రాష్ట్రాల్లో.. ఓవర్సీస్ : ఇంకా ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో మాత్రం పెద్దగా అనుకున్నంత స్థాయిలో బజ్ అయితే క్రియేట్ చేయలేదు. ఇక కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమా ఒకటి. రెండు కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో మాత్రం 2.4 కోట్ల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేసింది.

టోటల్ బిజినెస్. మ్ టార్గెట్ ఫిక్స్ : ప్రపంచవ్యాప్తంగా కస్టడీ సినిమా తెలుగులో 21.80 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య రేంజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది. కానీ టాక్ బాగుంటేనే ఈ రోజులలో పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ ఏమాత్రం బాగుండడం లేదు. ఇక కస్టడీ సినిమా ఫైనల్ టార్గెట్ అయితే 22.50 కోట్లు. మరి ఈ టార్గెట్ ను సినిమా ఎన్ని రోజులలో ఫినిష్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications










