Love Story Day 2 Collections: చైతూ మూవీకి ఊహించని వసూళ్లు.. టాలీవుడ్‌లో రెండో స్థానానికి లవ్ స్టోరీ

కోవిడ్ కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఉత్పన్నం అయ్యాయి. షూటింగ్‌లు నిలిచిపోవడం, థియేటర్లు మూసివేత, టికెట్ రేట్ల తగ్గింపు వంటి కారణాలలో చాలా సినిమాలు విడుదల కాలేదు. అందులో కొన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం ఎన్నోసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అలాంటి వాటిలో నాగ చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీ ఒకటి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను అందుకుని సత్తా చాటింది. దీంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఇక, ఈ మూవీ రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

‘లవ్ స్టొరీ' అంటూ వచ్చిన చైతూ పల్లవి

‘లవ్ స్టొరీ' అంటూ వచ్చిన చైతూ పల్లవి

యువ సామ్రాట్ నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. సున్నితమైన ప్రేమకథతో ఇది తెరకెక్కింది.

భారీ అంచనాలు... బిజినెస్ కూడా అలాగే

భారీ అంచనాలు... బిజినెస్ కూడా అలాగే

ఆది నుంచే 'లవ్ స్టోరీ' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో సెకెండ్ వేవ్ తర్వాత భారీ బిజినెస్ నమోదైంది.

రెండో రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది

రెండో రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది

'లవ్ స్టోరీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 81 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 61 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో.. మొత్తం రూ. 5.08 కోట్లు షేర్, రూ. 8.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెండు రోజులకు కలిపి ఎంత వచ్చిందంటే

రెండు రోజులకు కలిపి ఎంత వచ్చిందంటే

'లవ్ స్టోరీ' మూవీకి రెండు రోజులకు కలిసి ఏపీ, తెలంగాణలో భారీ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 5.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.89 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.41 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 76 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, గుంటూరులో రూ. 83 లక్షలు, కృష్ణాలో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో.. మొత్తం రూ. 12.21 కోట్లు షేర్, రూ. 19.13 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?


తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 12.21 కోట్లు కొల్లగొట్టిన 'లవ్ స్టోరీ' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 74 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 3.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 16.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 26 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఇంకెంత రావాలి?

నాగ చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజులకు దీనికి రూ. 16.30 కోట్లు వచ్చాయి. అంటే మరో 15.70 కోట్లు వస్తే క్లీన్ హిట్ అవుతుందీ చిత్రం.

Recommended Video

Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi
టాలీవుడ్‌లో రెండో చిత్రంగా కొత్త రికార్డుతో

టాలీవుడ్‌లో రెండో చిత్రంగా కొత్త రికార్డుతో

మొదటి రోజు లాగే 'లవ్ స్టోరీ' చిత్రానికి రెండో రోజు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 5.08 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో రెండో రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానానికి చేరుకుంది. దీని కంటే ముందు రూ. 6.86 కోట్లతో 'ఉప్పెన' మొదటి స్థానంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X