Rangabali 5 Days Collections: నాగశౌర్యకు కలిసిరాని రంగబలి.. ఘోరంగా వసూళ్లు.. 5 రోజుల్లో ఇంతే!

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల కృష్ణవ్రింద విహారి, 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' వంటి సినిమాలతో ఫెయిల్యూర్ చూసిన నాగశౌర్య మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం రంగబలి. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అంతగా సాధించలేకపోతుంది. ఈ నేపథ్యంలో రంగబలి 5 రోజుల వసూళ్ల లెక్కలపై ఓ లుక్కేస్తే..

Naga Shaurya Rangabali Movie 5 Days Worldwide Official Box Office Collections

నటీనటులు: నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'రంగబలి'. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. దసరా ఫేమ్ షైన్ టామ్ చాకోతోపాటు శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. పవన్ సీఎస్ సంగీతం అందించారు.

Naga Shaurya Rangabali Movie 5 Days Worldwide Official Box Office Collections

బిజినెస్: నాగశౌర్య, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా తొలిసారి జతకట్టిన రంగబలి సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కాస్తా వివాదంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో రంగబలి మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక నాగ శౌర్య మార్కెట్ కు తగినట్లుగా బిజినెస్ జరిగింది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 5.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగింది.

Naga Shaurya Rangabali Movie 5 Days Worldwide Official Box Office Collections

తెలుగు రాష్ట్రాల్లో: రంగబలి చిత్రానికి రోజురోజుకీ వసూళ్లు తగ్గుతున్నాయి. ఐదో రోజు కూడా ఏపీ, తెలంగాణలో కలెక్షన్స్ అలానే ఉన్నాయి. నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో కలిపి.. రూ. 24 లక్షలు షేర్, రూ. 50 లక్షల గ్రాస్ మాత్రమే సాధించింది.

Naga Shaurya Rangabali Movie 5 Days Worldwide Official Box Office Collections

5 రోజుల్లో: నాగశౌర్య లేటెస్ట్ మూవీ రంగబలికి తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో వసూళ్లు తక్కువగా కలెక్ట్ అయ్యాయి. ఇప్పటికీ నైజాంలో రూ. 96 లక్షలు, సీడెడ్‌లో రూ. 29 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 21 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలు వచ్చాయి. ఇలా రూ. 2.58 కోట్లు షేర్, రూ. 5 కోట్లు గ్రాస్ వచ్చింది.

Naga Shaurya Rangabali Movie 5 Days Worldwide Official Box Office Collections

వరల్డ్ వైడ్: ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 2.58 కోట్లు షేర్ మాత్రమే రాబట్టింది నాగశౌర్య రంగబలి చిత్రం. అలాగే కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి ఈ సినిమాకు 5 రోజుల్లో రూ. 55 లక్షలు మాత్రమే కలెక్ట్ అయ్యాయి. ఇలా రంగబలి చిత్రం 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.13 కోట్లు షేర్‌, రూ. 6.30 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టగలిగింది.

Naga Shaurya Rangabali Movie 5 Days Worldwide Official Box Office Collections

క్లీన్ హిట్ కొట్టాలంటే?: పవన్ బాసంశెట్టి డైరెక్షన్ లో వచ్చిన రంగబలి చిత్రానికి రూ. రూ. 6.20 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక సినిమాకు 5 రోజుల్లో రూ. 3.13 వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే రంగబలి సినిమా రూ. 3.07 కోట్లు వసూళ్లు సాధిస్తేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశైర్య కెరీర్ లో మరో హిట్ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X