Rangabali 1st Week Collections: 6.20 కోట్లు వస్తే హిట్.. వారంలో వచ్చింది ఇంతే.. కోట్ల నష్టాల దిశగా!

నాగశౌర్య.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ కుర్రాడు దాదాపు దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా అడపాదడపా విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.

కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం హిట్ అనే మాటనే వినలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే నాగశౌర్య 'రంగబలి' అనే ఎంటర్‌టైనర్‌ మూవీతో వచ్చాడు. కానీ, ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన రాకపోవడంతో కలెక్షన్లు ఆశించిన రీతిలో దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ 7 రోజుల రిపోర్టును మీరే చూడండి!

Naga Shaurya Starrer Rangabali Movie 1st Week Worldwide Official Collections

రంగబలితో వచ్చిన నాగశౌర్య : టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రమే 'రంగబలి'. పవన్ బాసంశెట్టి తీసిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. దీనికి పవన్ సీఎస్ సంగీతాన్ని అందించాడు. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రల్లో కనిపించారు.

Naga Shaurya Starrer Rangabali Movie 1st Week Worldwide Official Collections

రంగబలి బిజినెస్ వివరాలివే : ఫన్ అండ్ యాక్షన్‌తో వచ్చిన 'రంగబలి' మూవీపై మొదట్లో పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ, ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు క్రమంగా పెరిగాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 'రంగబలి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో రూ. 5.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Naga Shaurya Starrer Rangabali Movie 1st Week Worldwide Official Collections

7వ రోజు తెలుగు వసూళ్లు : నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి రూపొందించిన 'రంగబలి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన రీతిలో ప్రేక్షకుల నుంచి స్పందన రావడం లేదు. దీంతో కలెక్షన్లు కూడా చాలా తక్కువగానే వస్తున్నాయి. ఇలా ఆరో రోజు దీనికి రూ. 16 లక్షలు షేర్ దక్కింది. ఈ క్రమంలోనే ఏడో రోజైన గురువారం నాగశౌర్య సినిమాకు మరింత తగ్గిపోయి కేవలం రూ. 11 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

Naga Shaurya Starrer Rangabali Movie 1st Week Worldwide Official Collections

7వ రోజులకు కలిపి ఎంతంటే : 'రంగబలి'కి ఆంధ్రా, తెలంగాణలో వారంలో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి.. రూ. 2.85 కోట్లు షేర్, రూ. 5.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

Naga Shaurya Starrer Rangabali Movie 1st Week Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే : ఏపీ, తెలంగాణలో వారం రోజుల్లో అతి తక్కువగా రూ. 2.85 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన నాగశౌర్య 'రంగబలి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా కేవలం రూ. 62 లక్షలే రాబట్టింది. ఇలా ఇది 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.47 కోట్లు షేర్‌, రూ. 7.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Naga Shaurya Starrer Rangabali Movie 1st Week Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి : నాగశౌర్య - యుక్తి తరేజా హీరో హీరోయిన్లుగా చేసిన 'రంగబలి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.20 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 3.47 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 2.73 కోట్లు వస్తేనే ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X