Rangabali 2 Days Collections: హాలీడే ఉన్నా షాకే.. 2 రోజుల్లో ఇంతేనా.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్

తెలుగులో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ వెళ్లే వాళ్లు మాత్రం అతి తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అందులో హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య ఒకడు. మొదట్లో లవ్ స్టోరీలతో సినిమాలు చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చి మూవీలు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు నాగశౌర్య 'రంగబలి' అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. కానీ, దీనికి ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో నాగశౌర్య మూవీ రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

 Naga Shaurya Starrer Rangabali Movie 2 Days Worldwide Official Collections

రంగబలి నుంచి వచ్చేశాడు: హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రమే 'రంగబలి'. పవన్ బాసంశెట్టి తీసిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దీనికి పవన్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రల్లో కనిపించారు.

 Naga Shaurya Starrer Rangabali Movie 2 Days Worldwide Official Collections

రంగబలి బిజినెస్ వివరాలివే: నాగశౌర్య హీరోగా చేసిన 'రంగబలి' మూవీపై మొదట్లో పెద్దగా బజ్ లేదు. కానీ, ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు క్రమంగా పెరిగాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 'రంగబలి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 5.50 కోట్లు మేర బిజినెస్‌ను చేసుకుంది.

 Naga Shaurya Starrer Rangabali Movie 2 Days Worldwide Official Collections

2వ రోజు తెలుగు వసూళ్లు: 'రంగబలి' మూవీకి ఏపీ, తెలంగాణలో 2వ రోజూ తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 69 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ దక్కింది.

 Naga Shaurya Starrer Rangabali Movie 2 Days Worldwide Official Collections

2వ రోజులకు కలిపి ఎంతంటే: 'రంగబలి'కి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 50 లక్షలు, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 1.39 కోట్లు షేర్, రూ. 2.60 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

 Naga Shaurya Starrer Rangabali Movie 2 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో అతి తక్కువగా రూ. 1.39 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన నాగశౌర్య 'రంగబలి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా కేవలం రూ. 28 లక్షలే రాబట్టింది. ఇలా ఇది 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.67 కోట్లు షేర్‌, రూ. 3.25 కోట్లు గ్రాస్ రాబట్టింది.

 Naga Shaurya Starrer Rangabali Movie 2 Days Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: నాగశౌర్య - పవన్ కాంబోలో వచ్చిన 'రంగబలి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.20 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ.1.67 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 4.53 కోట్లు రాబడితేనే నాగశౌర్య మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X