Rangabali 3 Days Collections: సండే ఊహించని వసూళ్లు.. 3 రోజుల్లో ఇంతేనా.. ఇంకా అన్ని కోట్లు రావాలా!
టాలీవుడ్‌లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఒకరకమైన స్పీడుతో సినిమాలు చేస్తున్న అతడు.. హిట్లకు పొంగకుండా.. ఫ్లాపులకు క్రుంగకుండా ముందుకు సాగుతున్నాడు.
ఇలా ఇప్పుడు 'రంగబలి' అనే ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీతో వచ్చాడు. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన అంతగా రావడం లేదు. దీంతో కలెక్షన్లు పెద్దగా దక్కట్లేదు. ఈ నేపథ్యంలో నాగశౌర్య మూవీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

రంగబలి కోసం నాగశౌర్య రాక: టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రమే 'రంగబలి'. పవన్ బాసంశెట్టి తీసిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి పవన్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు.

రంగబలి బిజినెస్ వివరాలివే: నాగశౌర్య హీరోగా పవన్ తెరకెక్కించిన 'రంగబలి' మూవీపై మొదట్లో పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ, ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు క్రమంగా పెరిగాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 'రంగబలి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో రూ. 5.50 కోట్లు బిజినెస్ జరిగింది.

3వ రోజు తెలుగు వసూళ్లు: సండే అయినా 3వ రోజు 'రంగబలి' మూవీకి ఏపీ, తెలంగాణలో తేలిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 25 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 65 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్ మాత్రమే దక్కింది.

3వ రోజులకు కలిపి ఎంతంటే: 3 రోజుల్లో 'రంగబలి'కి ఆంధ్రా, తెలంగాణలో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 75 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 29 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి.. రూ. 2.04 కోట్లు షేర్, రూ. 3.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఏపీ, తెలంగాణలో 3 రోజుల్లో అతి తక్కువగా రూ. 2.04 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన నాగశౌర్య 'రంగబలి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా కేవలం రూ. 44 లక్షలే రాబట్టింది. ఇలా ఇది 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.48 కోట్లు షేర్, రూ. 4.85 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: నాగశౌర్య - యుక్తి తరేజా నటించిన 'రంగబలి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.20 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 2.48 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 3.72 కోట్లు రాబడితేనే నాగశౌర్య మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.


Click it and Unblock the Notifications











