Rangabali 4 Days Collections: నాగశౌర్యకు షాక్ ఇచ్చిన రంగబలి.. దారుణంగా పడిపోయిన కలెక్షన్స్
హీరో నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం రంగబలి. ఈ చిత్రానికి బసంశెట్టి పవన్ దర్శకత్వం వహించాడు. ఇక గత శుక్రవారం రిలీజ్ అవ్వగా.. బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. మిక్స్డ్ టాక్ తో సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిందనే చెప్పాలి. ఇక నాలుగవ రోజు కలెక్షన్స్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. బాగా పడిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే...
హీరో నాగశౌర్య.. మొదటి నుంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేస్తూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో నాగశౌర్యకు మంచి క్రేజ్ అయితే ఉంది. గత కొంత కాలంగా హిట్లు లేక సతమతమవుతున్న ఈ హీరో.. ఇటీవల రంగబలి అనే సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు మొదట్లో అంచనాలు నెలకొన్నప్పటికీ.. రిలీజ్ అయినప్పటి నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు ఈ సినిమాకి ముందు రిలీజ్ అయిన సామజవరగమన చిత్రం కలెక్షన్లతో దూసుకువెళ్తోంది.

శ్రీవిష్ణు నటించిన సామాజవరగమన చిత్రానికి మంచి టాక్ సొంతం చేసుకుంది. మౌత్ టాక్ తోనే ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఇక నాగశౌర్య రంగబలి చిత్రానికి మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో.. ఆ సినిమా వైపు చూసే ప్రేక్షుకుడు కరువయ్యాడు. దీంతో దారుణంగా రోజు రోజుకు కలెక్షన్స్ పడిపోతున్నాయి. వీకెండ్ కూడా ఈ సినిమాను కాపాడలేక పోయింది. పెళ్లి తర్వాత నాగశౌర్య నటిస్తున్న చిత్రం కావడం.. ఆయన కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

'రంగబలి'కి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 87లక్షలు, సీడెడ్‌లో రూ. 27 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.33 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ.11 లక్షలతో కలిపి.. రూ. 2.34 కోట్లు షేర్, రూ.4.50 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.


Click it and Unblock the Notifications











