Rangabali 6 Days Collections: సగానికి సగం డౌన్.. రంగబలి ఖేల్ ఖతం.. వామ్మో ఇంకా అన్ని కోట్లు రావాలా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కొందరు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తూ.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఒకడు. సినిమా రిజల్ట్‌ను పట్టించుకోని అతడు.. ఏడాదికి కనీసం మూడు సినిమాలనైనా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రంగబలి' అనే ఎంటర్‌టైనర్‌ మూవీతో వచ్చాడు. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన అంతగా రావడం లేదు. దీంతో కలెక్షన్లు ఆశించిన రీతిలో దక్కడం లేదు. ఈ నేపథ్యంలో నాగశౌర్య మూవీ 6 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

రంగబలి అంటూ వచ్చేశాడు:హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రమే 'రంగబలి'. పవన్ బాసంశెట్టి తీసిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి పవన్ సీఎస్ సంగీతాన్ని అందించాడు.

Naga Shaurya Starrer Rangabali Movie 6 Days Worldwide Official Collections

రంగబలి బిజినెస్ వివరాలివే:నాగశౌర్య నటించిన 'రంగబలి' మూవీపై మొదట్లో పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ, ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు క్రమంగా పెరిగాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 'రంగబలి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో రూ. 5.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ అయింది.

Naga Shaurya Starrer Rangabali Movie 6 Days Worldwide Official Collections

6వ రోజు తెలుగు వసూళ్లు:నాగశౌర్య - పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'రంగబలి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన రీతిలో ప్రేక్షకుల నుంచి స్పందన రావడం లేదు. దీంతో కలెక్షన్లు కూడా చాలా తక్కువగానే వస్తున్నాయి. ఇలా ఐదో రోజు దీనికి రూ. 31 లక్షలు షేర్ దక్కింది. ఈ క్రమంలోనే ఆరో రోజైన బుధవారం నాగశౌర్య సినిమాకు కేవలం రూ. 16 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

Naga Shaurya Starrer Rangabali Movie 6 Days Worldwide Official Collections

6వ రోజులకు కలిపి ఎంతంటే:6 రోజుల్లో 'రంగబలి'కి ఆంధ్రా, తెలంగాణలో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 38 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి.. రూ. 2.74 కోట్లు షేర్, రూ. 5.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

Naga Shaurya Starrer Rangabali Movie 6 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఏపీ, తెలంగాణలో 6 రోజుల్లో అతి తక్కువగా రూ. 2.74 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన నాగశౌర్య 'రంగబలి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా కేవలం రూ. 59 లక్షలే రాబట్టింది. ఇలా ఇది 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.33 కోట్లు షేర్‌, రూ. 6.75 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Naga Shaurya Starrer Rangabali Movie 6 Days Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:నాగశౌర్య - యుక్తి తరేజా జంటగా నటించిన 'రంగబలి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.20 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 3.33 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 2.87 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X