Rangabali Day 1 Collections: తొలి రోజే దారుణమైన వసూళ్లు.. నాగశౌర్యకు షాక్.. ఎన్ని కోట్లు రావాలంటే!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోన్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఆరంభంలోనే ఎన్నో మంచి విజయాలను సొంతం చేసుకున్న అతడు.. పరాజయాలు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోన్నాడు.
ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రంగబలి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి తొలి రోజే దారుణమైన వసూళ్లు దక్కాయి. ఈ నేపథ్యంలో నాగశౌర్య మూవీ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

రంగబలి అంటూ వచ్చేశాడు: యంగ్ హీరో నాగశౌర్య చేసిన చిత్రమే 'రంగబలి'. పవన్ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తీసిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దీనికి పవన్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రల్లో నటించారు.

రంగబలి బిజినెస్ వివరాలివే: నాగశౌర్య నటించిన 'రంగబలి' మూవీపై ఆరంభంలో పెద్దగా బజ్ లేదు. కానీ, ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు క్రమంగా పెరిగాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 'రంగబలి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

అలాంటి టాక్.. కలెక్షన్లు డల్: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన నాగశౌర్య 'రంగబలి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ఆశించిన రీతిలో రెస్పాన్స్ మాత్రం దక్కలేదు. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన తక్కువ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకారమే తక్కువగా వసూళ్లు లభించాయి.
తొలి రోజు తెలుగు వసూళ్లు: 'రంగబలి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 70 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజే అతి తక్కువగా రూ. 70 లక్షలు షేర్ మాత్రమే రాబట్టిన నాగశౌర్య 'రంగబలి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా కేవలం రూ. 15 లక్షలే రాబట్టింది. ఇలా ఇది ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 లక్షలు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రంగబలి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.20 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 85 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 5.35 కోట్లు రాబడితేనే నాగశౌర్య మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.


Click it and Unblock the Notifications











