Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అశ్వత్థామ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. ఎంత నష్టం వచ్చిందంటే
యువ హీరో నాగశౌర్య నటించిన అశ్వత్థామ చిత్రం భారీ అంచనాలతో రిలీజైంది. అయితే తొలుత సాధించిన వసూళ్లను నిలబెట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది. దీంతో నాగశౌర్య ఆశలు మరోసారి అడియాసలు అయ్యాయి. అశ్వత్థామకు ఫీల్ గుడ్ టాక్ వచ్చినా దానిని కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోవడం మైనస్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అశ్వత్థామ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.6.50 కోట్ల బిజినెస్ చేసింది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.7.20 కోట్లు రాబట్టాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
ఇక అశ్వత్థామ చిత్ర క్లోజింగ్ కలెక్షన్లు చూస్తే.. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.3.92 కోట్లు సాధించింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.4.83 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.7.85 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక క్లోజింగ్ కలెక్షన్ల పరిశీలిస్తే రూ.1.67 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద నాగశౌర్యకు ప్లాప్ దక్కింది.
నాగశౌర్య, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన అశ్వత్థామ చిత్రం జనవరి 31న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రహన తేజ సీల దర్శకత్వం వహించారు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించారు. ఉషా ముల్పూరి నాగశౌర్య తల్లి అనే విషయం తెలిసిందే.