twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అశ్వత్థామ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. ఎంత నష్టం వచ్చిందంటే

    |

    యువ హీరో నాగశౌర్య నటించిన అశ్వత్థామ చిత్రం భారీ అంచనాలతో రిలీజైంది. అయితే తొలుత సాధించిన వసూళ్లను నిలబెట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది. దీంతో నాగశౌర్య ఆశలు మరోసారి అడియాసలు అయ్యాయి. అశ్వత్థామకు ఫీల్ గుడ్ టాక్ వచ్చినా దానిని కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోవడం మైనస్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    అశ్వత్థామ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.6.50 కోట్ల బిజినెస్ చేసింది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.7.20 కోట్లు రాబట్టాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

     Naga Shouryas Ashwathama movie closing collections

    ఇక అశ్వత్థామ చిత్ర క్లోజింగ్ కలెక్షన్లు చూస్తే.. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.3.92 కోట్లు సాధించింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.4.83 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.7.85 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక క్లోజింగ్ కలెక్షన్ల పరిశీలిస్తే రూ.1.67 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద నాగశౌర్యకు ప్లాప్ దక్కింది.

    నాగశౌర్య, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన అశ్వత్థామ చిత్రం జనవరి 31న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రహన తేజ సీల దర్శకత్వం వహించారు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించారు. ఉషా ముల్పూరి నాగశౌర్య తల్లి అనే విషయం తెలిసిందే.

    English summary
    Naga Shaurya Mulpuri is an Telugu film actor. His latest movie Ashwathama hits the screen on January 31st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X