Varudu Kaavalenu Collections: నాగశౌర్య సినిమాకు ఊహించని కలెక్షన్లు.. ఫస్ట్ డే వచ్చింది ఎంతంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌‌ను సొంతం చేసుకున్నాడు హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో నటించిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఈ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం దక్కించుకున్నాడు. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించాడు. అయితే, ఇవి అతడికి వర్కౌట్ కాలేదు. దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక, ఇప్పుడు 'వరుడు కావలెను' అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

‘వరుడు కావలెను' అంటూ వచ్చారు

‘వరుడు కావలెను' అంటూ వచ్చారు

నాగశౌర్య - రితూ వర్మ జంటగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో మురళి శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు నటించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు.

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

నాగశౌర్యకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'వరుడు కావలెను' మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే మరో రూ. 60 లక్షలు వ్యాపారం జరిగింది. దీంతో మొత్తంగా ఈ సినిమా రూ. 8.60 కోట్లు బిజినెస్ జరుపుకుందట.

అంచనాలు భారీగా... రెస్పాన్స్ బాగానే

అంచనాలు భారీగా... రెస్పాన్స్ బాగానే

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'వరుడు కావలెను' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులోని 'దిగు దిగు దిగు నాగ' సాంగ్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, టీజర్, ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 తొలి రోజు ఎక్కడ.. ఎంత రాబట్టిందంటే

తొలి రోజు ఎక్కడ.. ఎంత రాబట్టిందంటే

'వరుడు కావలెను' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 6.20 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. మొదటి రోజు రూ. 96 లక్షలు షేర్, రూ. 1.60 కోట్ల గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న రేంజ్‌లో రాబట్టలేకపోయిన 'వరుడు కావలెను' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ అలాగే కనిపించిది. ఫలితంగా మొదటి రోజు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 లక్షలు, ఓవర్సీస్‌లో కేవలం రూ. 35 లక్షలు కలెక్ట్ చేసింది. వీటితో కలుపుకుంటే ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.36 కోట్లు షేర్, రూ. 2.42 కోట్లు గ్రాస్‌ను రాబట్టి పర్వాలేదనిపించింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

మిగిలిన హీరోలతో పోలిస్తే నాగశౌర్యకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయితే, 'వరుడు కావలెను' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.60 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు దీనికి రూ. 1.36 కోట్లు వసూలు అయ్యాయి. అంటే మరో రూ. 7.64 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X