Varudu Kaavalenu Collections: ఆదివారం ఈ రేంజ్ కలెక్షన్లా.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను చేసి 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోగా మారాడు హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న అతడు.. లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం దక్కించుకున్నాడు. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ, ఇవేమీ అతడికి అంతగా కలిసి రాలేదు. దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే నిర్మాతగానూ మారి పలు హిట్లను అందుకున్నాడు. ఇక, ఇప్పుడు 'వరుడు కావలెను' అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మూడో రోజు బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన నాగశౌర్య

ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన నాగశౌర్య

నాగశౌర్య - రితూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. ఈ సినిమాను లక్ష్మీ సౌజన్య తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో మురళి శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు నటించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు.

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

మిగిలిన యంగ్ హీరోలతో పోలిస్తే నాగశౌర్యకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'వరుడు కావలెను' మూవీపై అంచనాలు ఉండడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల వ్యాపారం జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే మరో రూ. 60 లక్షలు వ్యాపారం జరిగింది. దీంతో మొత్తంగా ఈ సినిమా రూ. 8.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 అంచనాలు భారీగా.. రెస్పాన్స్ మాత్రం

అంచనాలు భారీగా.. రెస్పాన్స్ మాత్రం

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'వరుడు కావలెను' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి మొదటి రోజు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రెండో రోజైన శనివారం మాత్రం ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన బాగా తగ్గిపోయింది. ఇక, మూడు రోజు కాస్త పెరుగుతుందని అనుకున్నా అంతగా వర్కౌట్ కాలేదు.

 మూడో రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

మూడో రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

'వరుడు కావలెను' మూవీకి మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రెండో రోజు రూ. 79 లక్షలు షేర్, రూ. 1.30 కోట్ల గ్రాస్‌ వచ్చింది.

 ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

'వరుడు కావలెను' మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో రూ. 2.38 కోట్లు వసూలు చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 13 లక్షలు, ఓవర్సీస్‌లో కేవలం రూ. 75 లక్షలు కలెక్ట్ చేసింది. వీటితో కలుపుకుంటే మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.26 కోట్లు షేర్, రూ. 5.65 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఆదివారం కలెక్షన్లు పెరుగుతాయనుకుంటే ఇలా జరిగింది.

Recommended Video

Varudu Kavalenu Movie Team Interview
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

నాగశౌర్య రేంజ్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయితే, 'వరుడు కావలెను' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.60 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 3.26 కోట్లు వసూలు అయ్యాయి. అంటే మరో రూ. 5.74 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X