twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varudu Kaavalenu Collections: షాకిస్తున్న కలెక్షన్లు..ఏమాత్రం ఊహించని విధంగా!

    |

    'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా మారిన నాగశౌర్య తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అలా లవర్ బాయ్ ఇమేజ్‌ను దక్కించుకున్న శౌర్య ఆ తర్వాత ఎక్కువగా అలాంటి సినిమాలే చేస్తూ వచ్చాడు. అయితే ఆ తరహా సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో విభిన్నమైన కధలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో 'వరుడు కావలెను' అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నాలుగో రోజు బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

     ఫ్యామిలీ డ్రామాతో

    ఫ్యామిలీ డ్రామాతో

    నాగశౌర్య - రితూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ డ్రామా మూవీ వరుడు కావలెను'. ఈ సినిమాను గతంలో టాప్ డైరెక్టర్ ల దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన లక్ష్మీ సౌజన్య తెరకెక్కించారు. సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. మురళి శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.

    భారీగా బిజినెస్

    భారీగా బిజినెస్

    మాములుగా తన తోటి కుర్ర హీరోలతో పోలిస్తే నాగశౌర్యకు పెద్దగా మార్కెట్ లేదు. అయితే 'వరుడు కావలెను' నిర్మాతలు, సినిమా నుంచి విడుదలైన పాటలు సినిమా మీద అంచనాలు పెంచడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల వ్యాపారం జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా మరో రూ. 60 లక్షలు వ్యాపారం జరగడంతో మొత్తంగా ఈ సినిమా రూ. 8.60 కోట్లు బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.

    భారీగా డ్రాప్

    భారీగా డ్రాప్

    అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వరుడు కావలెను' మొదటి రోజు భారీ రెస్పాన్స్ తెచ్చుకుని కలెక్షన్లు సాదించింది. అయితే సినిమా రొటీన్ సినిమానే అనే మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో రెండో రోజైన శనివారం మాత్రం ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన బాగా తగ్గిపోయింది. ఇక, మూడు రోజు కాస్త పెరుగుతుందని అనుకున్నా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక నాలుగో రోజు భారీగా దెబ్బవేసింది.

     నాలుగో రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

    నాలుగో రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

    'వరుడు కావలెను' మూవీకి నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ.12 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండో రోజు రూ. 40 లక్షలు షేర్, రూ. 66 లక్షల గ్రాస్‌ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

    'వరుడు కావలెను' మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో రూ. 2.78 కోట్లు వసూలు చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 16 లక్షలు, ఓవర్సీస్‌లో కేవలం రూ. 81 లక్షలు కలెక్ట్ చేసింది. వీటితో కలుపుకుంటే మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.75 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఆదివారం కలెక్షన్లు పెరుగుతాయనుకుంటే ఇలా జరిగింది.

    Recommended Video

    Varudu Kavalenu Movie Team Interview
    బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత రావాలి?


    నాగశౌర్య రేంజ్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయితే, 'వరుడు కావలెను' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.60 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ.3.75 కోట్లు వసూలు అయ్యాయి. అంటే మరో రూ. 5.25 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

    English summary
    Young Hero Naga Shaurya's Varudu Kaavalenu Collected Rs 3.75 Crores in four Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X