Varudu Kaavalenu Collections: టాక్ ఒకలా కలెక్షన్లు దారుణం.. 9 కోట్ల టార్గెట్‌కు వచ్చింది ఇంతే!

హ్యాండ్సమ్ లుక్స్.. అద్భుతమైన యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నాగశౌర్య. మొదటి చిత్రంతోనే మంచి హిట్‌తో పాటు గుర్తింపును అందుకున్న అతడు.. అప్పటి నుంచి జయాపజయాలతో ముందుకు సాగుతున్నాడు. అయితే, ఆరంభంలో ఒకే రకమైన సినిమాలు చేసినా.. కొంత కాలంగా పంథాను మార్చుకుని ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే 'అశ్వద్ధామ' అనే చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, ఇప్పుడు 'వరుడు కావలెను' అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐదు రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

 ‘వరుడు కావలెను' అంటూ నాగశౌర్య

‘వరుడు కావలెను' అంటూ నాగశౌర్య

నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. రితూ వర్మ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాను లక్ష్మీ సౌజన్య తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో మురళి శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు నటించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు.

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

తెలుగులోని యంగ్ హీరోలతో పోలిస్తే నాగశౌర్యకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'వరుడు కావలెను' మూవీపై అంచనాలు ఉండడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల వ్యాపారం జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే మరో రూ. 60 లక్షలు వ్యాపారం జరిగింది. దీంతో మొత్తంగా ఈ సినిమా రూ. 8.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అంచనాలు భారీగా.. రెస్పాన్స్ మాత్రం

అంచనాలు భారీగా.. రెస్పాన్స్ మాత్రం

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'వరుడు కావలెను' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి మొదటి రోజు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రెండో రోజు నుంచి ఈ సినిమాకు ప్రతికూల స్పందన వచ్చింది. దీంతో రోజు రోజుకూ రెస్పాన్స్ తగ్గుతూనే ఉంది. దీంతో కలెక్షన్లపై ఈ ప్రభావం భారీ స్థాయిలో పడిందనే చెప్పాలి.

ఐదు రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

ఐదు రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

'వరుడు కావలెను' మూవీకి ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ చిత్రానికి చాలా తక్కువ మొత్తాలే వసూలు అయ్యాయి. నాలుగో రోజైన సోమవారం రూ. 40 లక్షలు వరకూ వసూలు చేయగా.. ఐదో రోజు మాత్రం కేవలం రూ. 25 లక్షలు మాత్రమే రాబట్టింది. దీంతో ఈ సినిమాకు వీక్ డేస్‌లో కష్టాలు మొదలయ్యాయనే కామెంట్స్ వస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

'వరుడు కావలెను' మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో చాలా అంటే చాలా తక్కువగా రూ. 3.03 కోట్లు వసూలు చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో కేవలం రూ. 85 లక్షలు కలెక్ట్ చేసింది. వీటితో కలుపుకుంటే ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.06 కోట్లు షేర్, రూ. 7.02 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

నాగశౌర్యకు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయితే, 'వరుడు కావలెను' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.60 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజుల్లో దీనికి రూ. 4.06 కోట్లు వసూలు అయ్యాయి. అంటే మరో రూ. 4.49 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X