Varudu Kaavalenu Collections: సగానికి సగం పడిపోయిన కలెక్షన్లు.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌‌ను సొంతం చేసుకున్నాడు హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో నటించిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఈ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం దక్కించుకున్నాడు. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించాడు. అయితే, ఇవి అతడికి వర్కౌట్ కాలేదు.

దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక, ఇప్పుడు 'వరుడు కావలెను' అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

‘వరుడు కావలెను' అంటూ వచ్చారు

‘వరుడు కావలెను' అంటూ వచ్చారు

నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'వరుడు కావలెను'. రితూ వర్మ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాను లక్ష్మీ సౌజన్య తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో మురళి శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు నటించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు.

 బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

యంగ్ హీరోల్లో నాగశౌర్యకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'వరుడు కావలెను' మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే మరో రూ. 60 లక్షలు వ్యాపారం జరిగింది. దీంతో మొత్తంగా ఈ సినిమా రూ. 8.60 కోట్లు బిజినెస్ జరిగిందని టాక్.

మొదటి రోజు అలా... రెండో రోజు ఇలా

మొదటి రోజు అలా... రెండో రోజు ఇలా

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'వరుడు కావలెను' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రెండో రోజైన శనివారం మాత్రం ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన బాగా తగ్గిపోయింది. దీని ప్రభావం ఈ సినిమా కలెక్షన్ల పైన కూడా బాగానే చూపించింది.

రెండో రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

రెండో రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

'వరుడు కావలెను' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రెండో రోజు రూ. 63 లక్షలు షేర్, రూ. 1.05 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

'వరుడు కావలెను' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 1.59 కోట్లు వసూలు చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో కేవలం రూ. 62 లక్షలు కలెక్ట్ చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.31 కోట్లు షేర్, రూ. 4.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టి పర్వాలేదనిపించింది. ఇది అనుకున్న దాని కంటే తక్కువే.

Recommended Video

Manchi Rojulochaie చిన్న సినిమానే.. కానీ కంటెంట్ లో పెద్ద సినిమా..!!
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

టాలీవుడ్‌లో సక్సెస్ అయినా నాగశౌర్యకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయితే, 'వరుడు కావలెను' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.60 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో దీనికి రూ. 2.31 కోట్లు వసూలు అయ్యాయి. అంటే మరో రూ. 6.69 కోట్లు వస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X