ఎన్టీఆర్ మూవీ 175 కోట్ల రికార్డు బిజినెస్.. నాగ వంశీ చేతికి దేవర
ఈ రానున్న రోజుల్లో తెలుగు సినిమా నుంచి ఉన్న కొన్ని బిగ్గెస్ట్ మాస్ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సంచలన పాన్ ఇండియా చిత్రం "దేవర పార్ట్ 1" కూడా ఒకటి. మరి గ్లోబల్ ఫినామినా RRR సక్సెస్ అనంతరం తారక్ నుంచి ఈ చిత్రం వస్తుండగా తారక్ కెరీర్ లో 30వ చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో రెండో ఇన్స్టాల్మంట్ సినిమాగా ఇది రాబోతుంది.
ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రంపై ఎనలేని హైప్ నెలకొంది. అయితే నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లోనే రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలు చేత అక్కడ ఆగి అక్టోబర్ 10 కి షిఫ్ట్ అయ్యింది. కానీ దానికి ముందే సెప్టెంబర్ 27 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ఓజి (OG) ముందు డేట్ లాక్ చేసుకుంది. కానీ ఆ డేట్ లో ఓజి రావడం కష్టం అనేసరికి ఆ మంచి డేట్ అండ్ స్లాట్ ని "దేవర" సొంతం చేసుకొని కాస్త ముందే వచ్చేందుకు సిద్ధం అయ్యింది.

అలా ఆ తర్వాత నుంచి సినిమాపై ఒకో అప్డేట్ తో భారీ హైప్ సెట్ అయ్యింది. ఇంతే కాకుండా ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ అయితే ఈ మధ్య కాలంలో జరిగిన బిగ్గెస్ట్ బిజినెస్ లలో దేవర కి కూడా ఊహించని రేంజ్ బిజినెస్ జరిగినట్టుగా టాక్ వచ్చింది. మెయిన్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత మాస్ ప్రొడ్యూసర్ సూర్య 'దేవర' నాగవంశీ ముందు వరుసలో ఉన్నాడని అప్పట్లోనే టాక్ వచ్చింది.
కాగా ఇప్పుడు బిగ్ అప్డేట్ ఇస్తూ తానే తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ సినిమా సొంతం చేసుకున్నట్టుగా ప్రౌడ్ గా అనౌన్స్ చేశారు. కాగా ఈ చిత్రాన్ని అయితే ఒక్క తెలుగు స్టేట్స్ లో రికార్డు ధర ఇచ్చి తాను సొంతం చేసుకున్నట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. కాగా కొన్ని మాస్ ఏరియాల్లో మెయిన్ గా సీడెడ్ లో చాలా ప్రాంతాల్లో దేవర కి ఆల్ టైం రికార్డు ధర ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలా ఓవరాల్ గా ఒక్క తెలుగు రాష్ట్రాల హక్కులే ఏకంగా 175 కోట్లకి పైగానే బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది.

175 అనేది ఎన్టీఆర్ కెరీర్లో ఎలాంటి నెంబర్ అనేది అందరికీ తెలుసు.. తెలుగులో హైయెస్ట్ సెంటర్స్ లో 175 రోజులు ఆడిన సినిమాగా ఎన్టీఆర్ కి 175 నెంబర్ తో చెక్కు చెదరని రికార్డు ఉంది. అలాంటిది ఈ నెంబర్ సెంటిమెంట్ తో సినిమాపై హైప్ కూడా గట్టిగానే ఉండడం ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ పై నమ్మకం ఉండడంతో ఆ దేవర కోసం ఈ సూర్య దేవర నాగవంశీ అంత మొత్తంలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇలా దేవర కి ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక ధరతో రికార్డు డీల్ క్లోజ్ అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాల్లో టాక్.
దీంతో ఒక్క తెలుగు స్టేట్స్ లోనే ఈ సినిమా 350 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంటే తప్ప టార్గెట్ ని రీచ్ కాలేదని చెప్పాలి. మరి ఈ యంగ్ ప్రొడ్యూసర్ మొదటిసారి తీసుకున్న ఇంత పెద్ద రిస్క్ ఎంతవరకు వర్క్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











