Nagabandham Day 1 Collections: నాగబంధం కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?

విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ నాగబంధం. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డిలు నిర్మించారు. ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, మహేశ్ మంజ్రేకర్, జగపతి బాబు, అనసూయ, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఎస్ సౌందర్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జునైద్ కుమార్, అభిలు సంగీతం అందించారు. ఆర్‌సీ ప్రణవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. పాన్ ఇండియా మూవీగా జూలై 3న వరల్డ్ వైడ్‌గా నాగబంధం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు నాగబంధం మూవీ వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

నాగబంధం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి నాగబంధం మూవీని దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. రిలీజ్‌కు ముందే భారీ హైప్ తెచ్చుకున్న నాగబంధం మూవీ.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ సత్తా చాటింది. థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం రైట్స్ 9 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 14 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి.

Nagabandham Day 1 Expected Box Office Collections Worldwide Virat Karrna s film Opening day Report

నాగబంధం బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
నాన్ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక రైట్స్ 2.7 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 70 లక్షల రూపాయలు చొప్పున జరిగింది. ఉత్తర భారతదేశం, నార్త్ అమెరికా, ఓవర్సీస్‌లోని ఇతర దేశాలలో ఈ సినిమాను కమీషన్ బేస్ మీద జీ స్టూడియోస్ రిలీజ్ చేస్తోంది. దాంతో మొత్తంగా నాగబంధంకు వరల్డ్ వైడ్‌గా 60 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 65 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

నాగబంధం అడ్వాన్స్ బుకింగ్
టీజర్, ట్రైలర్‌లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో నాగబంధం మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగా అడ్వాన్స్ బుకింగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారత్‌లో తొలిరోజు భారత్‌లో 3600 షోలకు గాను లక్షా 40 వేల టికెట్లు అమ్ముడై 2.17 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లో తెలంగాణలో 1.05 కోట్ల రూపాయాలు, ఆంధ్రప్రదేశ్‌లో 64.13 లక్షల రూపాయలు, కర్ణాటకలో 19.57 లక్షల రూపాయలు, తమిళనాడులో 10.04 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 3.33 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

నాగబంధం ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక నాగబంధం ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. జూలై 2 వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి నార్త్ అమెరికాలో 115 సెంటర్స్‌లో 177 ప్రీమియర్ షోలకు గాను 1411 టికెట్స్ అమ్ముడై 20,941 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 20 లక్షల రూపాయలు) వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తద్వారా అడ్వాన్స్ బుకింగ్‌లోనే నాగబంధం వరల్డ్ వైడ్‌గా 2.50 కోట్ల రూపాయలు రాబట్టినట్లు విశ్లేషకులు తెలిపారు.

నాగబంధం తొలిరోజు వసూళ్లు అంచనా
పురాణాలు, ట్రెజర్ హంటింగ్ వంటి ఇతివృత్తాలతో వచ్చే సినిమాలకు మన దగ్గర మంచి రెస్పాన్స్ ఉంటుంది. పాజిటివ్ రివ్యూలు, టాక్ నేపథ్యంలో నాగబంధం మూవీకి తొలిరోజు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. జూలై 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో నాగబంధం మూవీకి 1600 షోలు ప్రదర్శితమైన 17 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది.

ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 344 షోలు, బెంగళూరులో 190 షోలు, విశాఖలో 88 షోలు, విజయవాడలో 73 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. వీకెండ్‌ నేపథ్యంలో శుక్రవారం నైట్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి స్పందన బాగుంటుందని అంచనా. తొలిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 4 నుంచి 5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X