Nagabandham Day 2 Collections: నాగబంధం కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?

Nagabandham Collections: యువ హీరో విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్ సినిమా 'నాగబంధం'. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే విడుదలైన తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. విజువల్స్‌, గ్రాఫిక్స్‌, సాంకేతిక విలువలు ఆకట్టుకున్నప్పటికీ, కథనం, స్క్రీన్‌ప్లే ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఎంత కలెక్ట్ చేసింది? రెండో రోజు మూవీ అంచనా కలెక్షన్లు ఎంతంటే?

Also Read
మూడుసార్లు అదే తప్పు.. త్రిష ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?
మూడుసార్లు అదే తప్పు.. త్రిష ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?

నాగబంధం సినిమాను నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, జగపతి బాబు, మహేశ్ మంజ్రేకర్, అనసూయ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిలింనగర్ టాక్ ప్రకారం.. నటీనటుల పారితోషికాలు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ వ్యయం, ప్రచార ఖర్చులు కలిపి 'నాగబంధం'ను 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజువల్ గ్రాండియర్‌కు పెద్దపీట వేయడంతో ఈ సినిమాకు భారీ వ్యయం జరిగినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Recommended For You
27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్‌‌తో జయకృష్ణ
27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్‌‌తో జయకృష్ణ
Nagabandham Day 2 Expected Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా
సినిమాపై ఉన్న అంచనాల కారణంగా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూషన్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా 27 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే.. నైజాం హక్కులు - 9 కోట్ల రూపాయలు, ఆంధ్రా హక్కులు - 14 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు - 4 కోట్ల రూపాయలు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 27 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల బయట కూడా సినిమాకు మంచి డిమాండ్ కనిపించింది. కర్ణాటక 2.7 కోట్ల రూపాయలు, తమిళనాడు 70 లక్షల రూపాయలు అందుకున్నట్టు తెలుస్తోంది.

You May Also Like
20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్? రామ్ చరణ్ కోసం సుకుమార్ కొత్త ప్రయోగం!
20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్? రామ్ చరణ్ కోసం సుకుమార్ కొత్త ప్రయోగం!

అలాగే నార్త్ ఇండియా, నార్త్ అమెరికా, ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో ఈ సినిమాని జీ స్టూడియోస్ కమిషన్ ప్రాతిపదికన విడుదల చేస్తోంది. బ్రేక్‌ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ట్రేడ్ అంచనాల ప్రకారం 'నాగబంధం' ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 65 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

ఆ స్వార్థంతోనే బిగ్ బాస్‌కి వెళ్లాను.. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లను: మాజీ కంటెస్టెంట్
ఆ స్వార్థంతోనే బిగ్ బాస్‌కి వెళ్లాను.. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లను: మాజీ కంటెస్టెంట్

ఓపెనింగ్ కలెక్షన్లు
భారీ అంచనాల మధ్య నాగబంధం మూవీకి మిక్స్డ్ టాక్ రాయడంతో తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లపైనా కనిపించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 3,202 షోలలో ప్రదర్శించబడింది. అయితే.. ఆక్సుపెన్సీ తక్కువగా నమోదు కావడంతో తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, 3.74 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది.

అందుకే బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశా.. అసలు కారణం చెప్పిన నాగదుర్గ!
అందుకే బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశా.. అసలు కారణం చెప్పిన నాగదుర్గ!

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు గణనీయమైన వసూళ్లు నమోదు అవుతాయని భావించినా, కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.5కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. భాషల వారీగా తొలి రోజు వసూళ్లు .. తెలుగులో 3.34 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, హిందీలో 24 లక్షలు, తమిళంలో గ్రాస్ 11 లక్షలు, మలయాళంలో కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేశాయి.

అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!
అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!

రెండో రోజు అంచనా కలెక్షన్లు

తొలి రోజు మిశ్రమ టాక్ రావడంతో వీకెండ్ వసూళ్లు కీలకంగా మారాయి. రెండో రోజు (శనివారం) కలెక్షన్లు పుంజుకునే అవకాశముంది. మధ్యాహ్నం 2 గంటల వరకు దేశవ్యాప్తంగా 628 నగరాల్లో 2,104 షోల ద్వారా 1.58 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సినిమా 15.4 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే.. సాయంత్రం, రాత్రి షోల కలెక్షన్ పెరిగే అవకాశముంది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఎక్కువ వసూళ్లు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచన ప్రకారం చూస్తే.. రెండో రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X