Nagabandham Day 3 Collections: వీకెండ్‌లో పుంజుకున్న 'నాగబంధం' కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?
Nagabandham Collections: పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై విడుదలకు ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్, వరల్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్, మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. విడుదల తర్వాత మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఎంత కలెక్ట్ చేసింది? మూడో రోజు మూవీ అంచనా కలెక్షన్లు ఎంతంటే?
నాగబంధం భారీ అంచనాలు నెలకొనడంతో థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లోకి రావాలంటే సినిమా సుమారు రూ.65 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇందులో నైజాం రూ.9 కోట్లు, ఆంధ్రా రూ.14 కోట్లు, సీడెడ్ రూ.4 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కర్ణాటకలో రూ.2.7 కోట్లు, తమిళనాడులో రూ.70 లక్షలకు హక్కులు అమ్ముడైనట్లు సమాచారం.

ఇక ఉత్తర భారతదేశం, నార్త్ అమెరికా, ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో చిత్రాన్ని జీ స్టూడియోస్ కమిషన్ ప్రాతిపదికన విడుదల అయింది. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా విజయవంతమై డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.65 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం 'నాగబంధం'కు సవాల్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కలెక్షన్ల పరంగా చూస్తే.. భారీ అంచనాలతో విడుదలైన నాగబంధం సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు అందుకోలేదనే చెప్పాలి. బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం.. తొలిరోజు (శుక్రవారం)సినిమా రూ. 3.40 కోట్ల నెట్ వసూలు చేయగా, రూ. 3.92 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాదాపు 3,200కు పైగా షోలలో సగటున 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక రెండో రోజు (శనివారం) ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు స్వల్పంగా పడిపోయాయి. రూ. 3.05 కోట్ల నెట్, రూ. 3.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకున్నాయి. మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ స్థాయిలో కలెక్షన్లు అందుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇలా తొలి రెండు రోజుల్లో 'నాగబంధం'ఇండియన్ బాక్సాఫీస్ రూ. 6.45 కోట్ల నెట్,7.44 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక విదేశాల్లో మరో రూ. 1.25 కోట్ల గ్రాస్ రాబట్టడంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 8.69 కోట్లకు చేరాయి. ఇక భాషల వారీగా చూస్తే తెలుగు వెర్షన్ నుంచి అత్యధిక ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో తెలుగు వెర్షన్ రూ. 5.55 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేయగా.. మిగిలిన భాషల్లో హిందీ రూ.0.60 కోట్లు, తమిళం రూ. 0.20 కోట్లు, కన్నడ రూ.4 లక్షలు, మలయాళం 6 లక్షలు అందుకున్నట్టు తెలుస్తోంది.
మూడో రోజు అంచనా కలెక్షన్లు
ఆదివారం (మూడో రోజు) కలెక్షన్లు పెరిగినట్టు తెలుస్తోంది. సాయంత్రం అందుబాటులో ఉన్న ట్రేడ్ వర్గాల వివరాల ప్రకారం.. 'నాగబంధం సినిమా దేశవ్యాప్తంగా 3,047 షోల ద్వారా రూ. 3.28 కోట్ల కలెక్షన్లు నమోదు చేసింది. మొత్తం 658 నగరాల్లో సినిమా ప్రదర్శించబడుతుండగా, సగటు 21 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా రూ. 5 కోట్ల వరకు కలెక్షన్లు అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా 1 కోటి వరకు కలెక్షన్లు అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పటివరకు పర్వాలేదని అనిపించినా.. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ ప్రయాణం ఎలా సాగుతోందో అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications




