Nagabandham Business: నాగబంధం వరల్డ్‌వైడ్ బిజినెస్.. బడ్జెట్, బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై యువ హీరో, హీరోయిన్లు విక్రాంత్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్షా నగార్కర్ నటించిన చిత్రం నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, మురళీ శర్మ, రామచంద్రరాజు, అనసూయ భరద్వాజ్, శరణ్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిర్మాత అభిషేక్ నామా తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఈ సినిమాకు కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్ ఎస్, మ్యూజిక్: జునైద్ కుమార్, అభి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జునైద్ కుమార్, ఎడిటర్: ఆర్సీ ప్రణవ్, ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్, కొరియోగ్రఫి: బృంద, గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ, యాక్షన్ కోరియోగ్రఫి: కనల్ కన్నన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. జూలై 3వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా భారీగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Nagabandham Pre Business Worldwide

పురాణాలు, చరిత్రలో మరుగుపడిన ఇతిహాస రహస్యాల ఆధారంగా యాక్షన్, అడ్వెంచర్, ఎమోషనల్ డ్రామాగా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను భారీ సెట్టింగులు, మేకప్ బేస్ క్యారెక్టర్లకు స్కోప్ ఉండేలా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం కోసం రాజీ పండకుండా భారీగా ఖర్చు చేశారు. గణేష్ ఆచార్య డిజైన్ చేసిన ఒక్క పాటను నభ నటేష్‌పై చిత్రీకరించడానికి 10 కోట్ల ఖర్చు చేశారు. పద్మనాభస్వామి ఆలయం, హిమాలయల సెట్టింగుల భారీగా వేశారు. ఈ సినిమా కోసం ఊహకు అందని విధంగా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ చేశారు. దాంతో ఈ సినిమా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా ఆదరణ లభించడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో, శాటిలైట్ రైట్స్‌ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకొన్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో ఈ సినిమా 40 కోట్ల రూపాయలు సాధించింది.

ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. నైజాం ఏరియా హక్కులు సుమారుగా 9 కోట్ల రూపాయలు, ఆంధ్రా ఏరియా హక్కులు 14 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 4 కోట్ల రూపాయల మేర జరిగింది. తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారుగా 27 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2.7 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 70 లక్షల రూపాయల మేర జరిగింది. ఇక నార్త్ ఇండియాలో ఈ సినిమాను కమీషన్ బేస్ మీద జియో స్టూడియో రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర వాల్యూ కట్టారని తెలిసింది.

ఇక ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... ఈ సినిమా రైట్స్ ఎవరికీ అమ్మకం జరుపలేదు. ఈ సినిమాను నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో ఈ సినిమాను కమిషన్ బేస్ మీద జియో స్టూడియో రిలీజ్ చేస్తున్నది. ఈ సంస్థ ఇటీవల ధురంధర్, పెద్ది చిత్రాలను భారీగా రిలీజ్ చేసింది. ఓవర్సీస్ రైట్స్ వాల్యూను సుమారుగా 10 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 60 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు అంచనాకు వచ్చారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 65 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X