twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju day 1 collections వసూళ్లు మోత మోగించిన బంగార్రాజు.. నాగార్జున కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు

    |

    సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన బంగార్రాజు చిత్రం అందరూ ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కుమ్మేసింది. పండుగ సీజన్‌లో విడుదలైన ఏకైక భారీ, స్టార్ వాల్యూ కలిగిన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ క్రమంలో తొలి రోజు బంగార్రాజు సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..

    చిన్న బంగార్రాజుగా చైతూ

    చిన్న బంగార్రాజుగా చైతూ

    నాగార్జున, నాగచైతన్య అక్కినేని కలిసి నటించిన బంగార్రాజు చిత్రం కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్. ఈ చిత్రంలో చైతూ చిన్న బంగార్రాజుగా ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై మరికొంత ఆసక్తి పెరిగింది. ఇంకా ఈ సినిమాకు పోటీ అనేది లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఏకపక్షంగా వసూళ్లను సాధించింది.

    రివ్యూ, రేటింగులను ఎదురించి

    రివ్యూ, రేటింగులను ఎదురించి

    సంక్రాంతి బరిలో దిగిన బంగార్రాజు చిత్రం తొలి ఆట ముగిసే సమయానికి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే సినీ విమర్శకుల వాదనలు, రివ్యూలు, రేటింగులను ఎదురించి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. దీంతో ఈవెనింగ్ షోలకు అక్యుపెన్సీ పెరిగింది. దాంతో భారీ వసూళ్లు తొలి రోజున నమోదయ్యాయి.

    తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో

    తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో

    ఇక తొలి రోజున బంగార్రాజు చిత్రం నైజాంలో ఫస్ట్ డే 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు, సీడెడ్‌లో 1.74 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.24 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 76 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 65 లక్షలు, గుంటూరు జిల్లాలో 89 లక్షలు, కృష్ణా జిల్లాలో 46 లక్షలు, నెల్లూరు జిల్లాలో 34 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణలో 8.11 కోట్లు నికరంగా, 12.9 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.

    ఫస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు

    ఫస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే బంగార్రాజు రాబట్టారు. కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో 80 లక్షలు సాధించింది. ఇక ఓవర్సీస్‌లో తొలి రోజు 45 లక్షలు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9.36 కోట్లు నికరంగా, 15.35 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    బంగార్రాజు లాభాల్లోకి రావాలంటే..

    బంగార్రాజు లాభాల్లోకి రావాలంటే..

    ఇక బంగార్రాజు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 34 కోట్లు, ఓవర్సీస్‌లో 2.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగింది. తొలి రోజున 9.36 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేస్తే లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది.

    English summary
    Tollywood Nagarjuna Akkineni's Bangarraju is hits the screens on January 14th. Here is the day 1 collections are 9 crores net, 15 crores gross collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X