Bangarraju day 1 collections.. నాగార్జున కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే...
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, యువ హీరో నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం ప్రత్యేకమైన పరిస్థితుల్లో సంక్రాంతి పండుగ బరిలోకి దిగింది. సంక్రాంతి 2022 బరిలో RRR, రాధేశ్యామ్ రిలీజ్ సిద్దమైన నేపథ్యంలో బంగార్రాజు కూడా బాక్సాఫీస్ బరిలో తాను ఉంటానని సంకేతాలిచ్చారు. అయితే చివరకు బంగార్రాజు మాత్రమే నికార్సుగా బరిలోకి దూకడం తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి రోజుల కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

RRR, రాధేశ్యామ్ రిలీజ్ వాయిదాతో
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో RRR, రాధేశ్యామ్ పోటీ నుంచి వెనుకంజ వేయడంతో బంగార్రాజుకు లైన్ క్లియర్ అయింది. అంతేకాకుండా ఏపీలో కర్ఫ్యూ కూడా ఎత్తివేయడంతో ఇంకా ఎదురులేకుండా పోయింది.

బంగార్రాజు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే
ఇక బంగార్రాజు సినిమా ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 11 కోట్ల రూపాయలు, సీ41డెడ్‌లో 6 కోట్లు, ఉత్తరాంధ్రలో 4. కోట్లు నమోదు చేసింది. ఆంధ్రాలోని గుంటూరు జిల్లాలో 3.24 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.88 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.60 కోట్లు, కృ.50ష్ణా 2.70 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.50 కోట్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం నైజాం, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 34 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..
ఇక తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.50 కోట్ల మేర, ఓవర్సీస్‌లో 2.50 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తంగా సుమారు 39 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో బంగార్రాజు సినిమా 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ఏపీ, ఆంధ్రాలో ఒపెనింగ్స్
బంగార్రాజు తొలి రోజున మంచి ఒపెనింగ్స్ లభించాయి. ఆంధ్రా, సీడెడ్‌లో పలు ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. నైజాంలో 60 శాతం ఆక్యుపెన్సీతో బంగార్రాజు రన్ అవుతున్నది. దీంతో నాగార్జున కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తున్నది.

తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..
బంగార్రాజు తొలి రోజున ఓవర్సీస్‌లో మోస్తారు వసూళ్లు కనిపించాయి. ప్రీమియర్ల ద్వారా 40k డాలర్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు 8 కోట్ల రూపాయలు తొలి రోజున వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశ ముందా లేదా అనేది తొలివారాంతంతో తేలిపోతుంది.


Click it and Unblock the Notifications











