The Ghost day 3 collections బాక్సాఫీస్ వేటలో గురితప్పిన నాగార్జున.. మూడో రోజు వసూళ్లు ఎంతంటే?
టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, కింగ్ నాగార్జున అక్కినేని కాంబినేషన్‌లో భారీ అంచనాలతో దసరా పండుగ కానుకగా ది ఘోస్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాలకు దిగువన ఉండటంతో బాక్సాఫీస్ వద్ద తడబాటుకు లోనవుతున్నది. పండుగ రేసులో యాక్షన్, థ్రిల్లర్‌గా రావడంతో ఓ వర్గం ప్రేక్షకుల నుంచి కొంత సానుకూలత కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ది ఘోస్ట్ చిత్రం మూడో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

ది ఘోస్ట్ గత 2 రోజుల్లో
ది ఘోస్ట్ చిత్రం గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓవరాల్‌గా ఈ చిత్రం గత 2 రోజుల్లో 2.76 కోట్ల షేర్, 5.56 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో తొలి రోజున కలుపుకొంటే.. 3.5 కోట్లు , రెండో రోజున 1.25 కోట్లు వసూళ్లు సాధించింది. దాంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం 4.75 కోట్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ది ఘోస్ట్ కలెక్షన్లు
గత రెండు రోజుల్లో ది ఘోస్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇతర చిత్రాల నుంచి భారీగా పోటీని ఎదుర్కొంటున్నది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 5.56 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 70 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6.26 కోట్లు రాబట్టింది.

మూడో రోజున ది ఘోస్ట్ ఆక్యుపెన్సీ
ది ఘోస్ట్ చిత్రం మూడో రోజున కూడా ప్రభావం చూపలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో 10 నుంచి 30 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. చెన్నైలో తెలుగు వెర్షన్ 30 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది. మిగితా ప్రాంతాల్లో 10 నుంచి 20 వరకే ఆక్యుపెన్సీ కనిపించింది.

ది ఘోస్ట్ 3వ రోజు కలెక్షన్ల అంచనా
తెలుగు రాష్ట్రాల్లో ది ఘోస్ట్ చిత్రం 3వ రోజున 50 లక్షల రూపాయల నుంచి 70 లక్షలు రాబట్టే అవకాశం ఉంది. ఇండియావైడ్‌గా 90 నుంచి 95 లక్షల రూపాయలు వసూలు చేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 2 కోట్ల గ్రాస్‌తో మొత్తంగా 8 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టవచ్చు అంటున్నారు.

ది ఘోస్ట్ నష్టాల నుంచి బయటపడాలంటే?
ఘోస్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 21.15 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ చిత్రం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఇప్పటి వరకు 3.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ చిత్రం ఇంకా 18 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











