నాగ్+వెంకీ=నాగచైతన్య
నాగ్ హీరోగా వచ్చిన శివ, కింగ్ చిత్రాలకు చంటి జోడిస్తే ఎలా వుంటుందో, 'జోష్" అలా వుంటుందని వెంకటేష్ 'జోష్" ఆడియో విడుదల వేడుకలో వ్యాఖ్యానించాడు. శివ+కింగ్+చంటి=జోష్...ఇది వెంకీ చెప్పిన ఈక్వేషన్. మేనల్లుడు నాగచైతన్య తెరంగేట్రానికి మురిసిపోతున్న వెంకటేష్, మేనల్లుడ్ని ఆశీర్వదిస్తూ, హీరోగా టాలీవుడ్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షించాడు. నాగార్జున, వెంకటేష్ బావా, బావమరుదులన్న సంగతి తెల్సిందే. వెంకటేష్ చెల్లెల్ని నాగార్జున పెళ్లి చేసుకున్నా, తర్వాతి కాలంలో ఆమెతో తెగతెంపులు చేసుకుని, ప్రస్తుతం అమలతో ఫ్యామిలీ లైఫ్ లో సెటిలైపోయాడు నాగార్జున. అలా నాగార్జున తొలి భార్య, వెంకటేష్ చెల్లెలి కుమారుడు నాగచైతన్య అటు దగ్గుబాటి కుటుంబానికీ, ఇటు అక్కినేని కుటుంబానికీ, ఇటు అక్కినేని కుటుంబానికీ ముద్దుల హీరో అయ్యాడు.
'జోష్" ఆడియో విడుదల వేడుకలో ఇద్దరు తాతయ్యలు అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు తమ మనవుడు హీరోగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ని సొంతం చేసుకోవాలని అభిలాషించారు. తాను బతికుండగానే నాగచైతన్యను హీరోగా చూడాలనుందని తన తండ్రి నాగేశ్వరరావు కోరారనీ, నాగచైతన్య వందో చిత్రం కూడా ఆయన చూస్తారని నాగార్జున ఉద్వేగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే నిర్మాతగా రామానాయుడు నిర్మించబోయే 200 చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించాలని నాగ్ ఆకాంక్షిండం కొసమెరుపు.


Click it and Unblock the Notifications











