నాగార్జున బాస్ కోసం బయ్యర్ల పోటీ
నేనున్నాను దర్శకుడు విఎన్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. నాగార్జున వరుస విజయాల బాటలో ఉండడం, నాగ్, విఎస్ ఆదిత్య కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు గొప్ప ప్రొఫైల్ వచ్చినట్టు తెలుస్తోంది. బాస్ కోసం అన్ని ఏరియాల నుంచి బయ్యర్లు పోటీపడుతున్నారు. వైజాగ్ ఏరియాకు ఈ సినిమా హక్కులు ఎన్‌ఆర్‌ఎ పద్ధతిలో అమ్ముడు కావడం సామాన్యమైన విషయం కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శివప్రసాద్ రెడ్డి నాగార్జునతో గతంలో విక్కీ దాదా, అల్లరి అల్లుడు, సీతారామరాజు ఎదురులేని మనిషి, నేనున్నాను సినిమాలు నిర్మించారు. బాస్‌లో నయనతార, పూనమ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications