కొడుకుమీద నమ్మకంతో నాగార్జునే స్వయంగా...

By Srikanya

తన కుమారుడు నాగచైతన్య తాజా చిత్రం బెజవాడపై ఉన్న నమ్మకంతో నాగార్జునే ఆ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. దాంతో నవంబర్ మూడవ తేదీన విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఎక్కడెక్కడి డిస్ట్ర్రిబ్యూటర్స్ ఈ చిత్రం కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గత చిత్రాలు ఫెయిల్యూర్ కావటం,అలాగే దర్శకుడు కొత్త వాడు కావటం,మరోప్రక్క నాగార్జున ఎంతో ఎక్సపెక్ట్ చేసి చేసిన దడ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం వంటివి ఈ చిత్రం మార్కెట్ పై పడకుండా నాగార్జున కొనటం ప్లస్ అయ్యిందంటున్నారు.మరి కొంతమంది ఇది ఓ బిజెనెస్ స్టాటజీ అని చెప్తున్నారు. నాగార్జున స్వయంగా నా కుమారుడు బాగా చేసాడని చెప్పటం కన్నా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంటే మిగతా వారిని ఎట్రాక్ట్ చేసినట్లు ఉంటుందని,నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్ కాబట్టి తప్పు చేయడని వారు నమ్ముతారని అంటున్నారు. ఇక అన్నపూర్ణ బ్యానర్ ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా వచ్చినట్లైంది.

బెజవాడని ఓ పాత్రగా చేసుకుని తీస్తున్న సినిమా ఇది. నాగచైతన్యలోని హీరోయిజాన్ని పూర్తి స్థాయిలో చూపించే సినిమా. ఇందులో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. వాటిని తెరమీద చూస్తేనే థ్రిల్ అని తెలిపారు దర్సకుడు వివేక్ కృష్ణ.నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'బెజవాడ'. రామ్‌గోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు నిర్మిస్తున్నారు. వివేక్‌కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అమలాపాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు దర్శకుడు. అలాగే ...దర్శకుడిగా నా తొలి చిత్రం ఇంత అద్భుతమైన కాంబినేషన్‌తో సెట్ కావడం నా అదృష్టం. రాముగారు 'బెజవాడ'ని ఎంతో ఇష్టపడి నిర్మిస్తున్నారు అన్నారు.

కథ గురించి చెపుతూ..''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.

ఇక నిర్మాత కిరణ్‌కుమార్ కోనేరు మాట్లాడుతూ ...రాముగారి నుంచి వస్తున్న ఓ డిఫరెంట్ కమర్షియల్ సినిమా ఇది. నాగచైతన్య అద్భుతంగా అభినయిస్తున్నాడు. 'బెజవాడ' షూటింగ్ ప్రారంభమైనప్పట్నించే అంఛనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వాటిని మించిన స్థాయిలో సినిమా ఉంటుంది. ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఐదుగురు ఫైట్ మాస్టర్లు ఈ చిత్రానికి పని చేయడం విశేషం. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం అని చెప్పారు.

ప్రభు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అజయ్, అంజనా సుఖాని, శుభలేఖ సుధాకర్, అభిమన్యుసింగ్, ముకుల్‌దేవ్, సత్యప్రకాశ్, అశోక్‌కుమార్, శ్రావణ్, లక్ష్మి, రాహుల్ తదితరులు కీలక పాత్రధారులు.ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, సిరాశ్రీ, కలువపాయి, సంగీతం: అమర్ మొహెలే, ప్రదీప్ కోనేరు, ప్రేమ, ధరమ్ సందీప్, విక్రమ్, బప్పీ టూటెల్, ఛాయాగ్రహణం: ఎస్.కె. భూపతి, కూర్పు: గౌతంరాజు, డాన్స్: ప్రేమ్‌రక్షిత్, శోభ, నిర్మాతలు: రాంగోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వివేక్‌కృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X