సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్లు,సమీకరణాలు మారటం కామన్ గా జరిగే విషయం.తాజాగాభధ్ర,తులసి తో ముందు కొచ్చిన బోయపాటి శ్రీనుకి నాగార్జునతో పనిచేసే అవకాశం మరింత దూర మయ్యేటట్లు ఉంది.ఇంతకు ముందు ఢీ తో హిట్ కొట్టి శ్రీను వైట్ల బోయపాటి శ్రీను ప్లేసులోకి వచ్చాడు.దాంతో నాగార్జున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో కింగ్ అవతారమెత్తి వినోదాన్ని పంచటానికి రెడీ అవుతున్నాడు.అంతేగాక లారెన్స్ తో చేసిన లాస్ట్ ఫిలిమ్ డాన్ ప్లాపయినా కామ్ గా కలక్షన్ రాబట్టటం నాగార్జున్న కు నచ్చినట్లుంది.లారెన్స్ కు మళ్లీ అవకాశ మివ్వటానికి రెడీ అవుతున్నాడట.మ..మ..మాస్ అంటూ నాగార్జనను ఓ రేంజిలో చూపిన లారెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓడినా ఈ సారి తగినంత కసరత్తు చేసే రెడి అవుతున్నాడట.తరువాత అన్నపూర్ణ బేనర్ పై లా రెన్స్ సినిమా స్టార్టయ్యే అవకాశముందంటున్నారు.ఇలా అయితే నాగా ర్జున మీదే ఆశలు పెట్టుకున్న బోయపాటి శ్రీను పరిస్ధితి ఏమిటో?