twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆఫీసర్ ఫస్ట్ డే కలెక్షన్స్: నాగ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్.. ఓవర్సీస్‌లో మరీ దారుణం!

    |

    రాంగోపాల్ వర్మ ప్రతిభ గల దర్శకుడే. కానీ హిట్టు సినిమా తీసి చాలా సంవత్సరాలు గడుస్తోంది. ఈ తరుణంలో వర్మతో సినిమా చేయడానికి నాగార్జున ఎందుకు ఒప్పుకున్నారు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. మరి కొందరు అభిమానులు మాత్రం శివ సినిమాని గుర్తు చేసుకుని వీరి కాంబినేషన్ మ్యాజిక్ చేసే అవకాశం ఉందని ఆశలు పెట్టుకున్నారు. కానీ వర్మలో దర్శకుడి పస పోయి చాలా కాలం అయిందని మరో మారు ఈ చిత్రం ద్వారా రుజువైంది. నాగార్జున కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవనుంది. అన్ని ఏరియాలలో ఈ చిత్రానికి దారుణమైన కలెక్షన్స్ నమోదవుతున్నాయి.

    మ్యాజిక్ అనుకున్నారు కానీ

    మ్యాజిక్ అనుకున్నారు కానీ

    ఆఫీసర్ చిత్రం అంతంత మాత్రం అంచనాలతోనే విడుదలయింది. నాగార్జున, వర్మ కాంబినేషన్ మ్యాజిక్ చేసే అవకాశం ఉందని భావించి థియేటర్స్ కు వెళ్లిన అభిమానులు పూర్తి నిరాశతో వెనుదిరిగారు. తాము ఆశలు పెట్టుకోవడమే కానీ వర్మ మారే పరిస్థితి లేదని అర్థం అయింది.

    నాగార్జున సినిమాకు ఇంత దారుణంగానా

    నాగార్జున సినిమాకు ఇంత దారుణంగానా

    స్టార్ హీరో సినిమా ఎంత డిజాస్టర్ అయినప్పటికీ తొలిరోజు వసూళ్లు ఎంతోకొంత బలంగా ఉంటాయి. నాగార్జున సినిమాకు కూడా మంచి వసూళ్లే నమోదు కావాలి. కానీ ఆఫీసర్ సినిమా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు కేవలం 47 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీనితో ఈ సినిమా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    ఓవర్సీస్‌లో ఘోరం

    ఓవర్సీస్‌లో ఘోరం

    నాగార్జున సినిమాలు ఓవర్సీస్ లో మంచి వసూళ్లనే రాబడతాయి. సినిమా ఎలా ఉన్నా 50 వేల డాలర్స్ నుంచి లక్ష డాలర్ల వరకు వసూలు చేస్తాయి. కానీ ఆఫీసర్ చిత్రం కేవలం 27 వేల డాలర్స్ కి మాత్రమే పరిమితం అయింది.

    పట్టుమని పది లక్షలు కూడా

    పట్టుమని పది లక్షలు కూడా

    ఆఫీసర్ చిత్ర వసూళ్లు ఏ ఏరియాలో కూడా పట్టుమని పది లక్షలు కూడా దాటలేదు. నైజాంలో 9 లక్షలు, ఉత్తరాంధ్రలో 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో 4 లక్షలు, నెల్లూరులో అయితే కేవలం 2 లక్షలకే పరిమితం అయింది.

    తొలి షో నుంచే

    తొలి షో నుంచే

    ఆఫీసర్ చిత్రానికి తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ మొదలైపోయింది. దీనితో అసలే బజ్ లేని చిత్రంగా విడుదలైన ఆఫీసర్ వసూళ్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. సినీ క్రిటిక్స్ కూడా ఈ చిత్రం డిజాస్టర్ అని తేల్చేశారు.

    English summary
    Nagarjuna-ram gopal varma officer movie first day collections report
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X