'మనం' శాటిలైట్ రైట్స్ రేటు సూపరూ
హైదరాబాద్ :అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమెనీ ఛానెల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏడు కోట్లు చెల్లించి ఈ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఫ్యామిలీ చిత్రం కావటం, నాగేశ్వరరావు గారి చివరి చిత్రం,భాక్సాఫీస్ వద్ద బాగా వర్కవుట్ అవటం వంటి అంశాలు ఈ రేటు పెట్టడానికి కారణం అంటున్నారు.
అలాగే బాలీవుడ్ నుంచి రీమేక్ ఆఫర్స్ వచ్చాయని చెప్తున్నారు. ప్రచారంలో ఉన్నదాన్ని బట్టి... నాగార్జున పాత్రలో అమీర్ ఖాన్, నాగచైతన్య పాత్రలో రణబీర్ కపూర్ చేస్తారని, అమితాబ్...నాగేశ్వరరావు చేసిన పాత్ర చేస్తారని చెప్తున్నారు. అలాగే...ఈ రీమేక్ లో శ్రేయ పాత్రను ప్రీతిజింతా, సమంత పాత్రను కత్రినా కైఫ్ చేస్తారని చెప్తున్నారు. అయితే అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ లేకుండా ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ఫిల్మ్ చేయటమేంటని అంటున్నారు.

కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం. అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











