Naa Saami Ranga 10 Days Collections: నా సామిరంగకు ఊహించని వసూళ్లు.. నాగార్జునకు లాభం ఎంతో తెలిస్తే!
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని చిత్రాలను అందించి.. ఇప్పటికి కూడా ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. భారీ హిట్ కోసం చూస్తున్న ఆయన.. ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' అనే ఫ్యామిలీ అండ్ మాస్ మూవీతో వచ్చారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది.
ఇలా ఈ సినిమా రెండో వారం నుంచే లాభాల బాటలో నడుస్తోంది. అయితే ఇప్పుడు డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున 'నా సామిరంగ' 10 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!

పండగకు సరైన సినిమాతో: అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రమే 'నా సామిరంగ'. విజయ్ బిన్నీ రూపొందించిన ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్: నాగార్జున నటించిన 'నా సామిరంగ'కు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ అయింది.

10వ రోజు ఎంత వచ్చింది?: 'నా సామిరంగ' మూవీకి 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ భారీగా తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 22 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వచ్చింది.

10 రోజుల్లో ఎంత వచ్చింది?: 10 రోజుల్లో 'నా సామిరంగ' మూవీకి తెలుగులో భారీ స్పందన లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.37 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, గుంటూరులో రూ. 1.44 కోట్లు, కృష్ణాలో రూ. 1.22 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలతో.. రూ. 19.13 కోట్లు షేర్, రూ. 31.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: టాలీవుడ్ కింగ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 19.13 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 73 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 59 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 20.44 కోట్లు షేర్‌తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: సంక్రాంతి కానుకగా వచ్చిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లోఈ సినిమాకు రూ. 20.44 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.44 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











