Naa Saami Ranga 12 Days Collections: నక్కతోక తొక్కిన నాగార్జున.. అన్ని కోట్లతో.. లాభం ఎంతో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మూవీలు చేస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ మధ్య కాలంలో కెరీర్‌ను ఆశించిన రీతిలో రాణించలేకపోతోన్న ఆయన.. ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' అనే మూవీతో వచ్చారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది. ఇలా ఈ సినిమా రెండో వారం నుంచే లాభాల బాటలో వెళ్తోంది. అయితే ఇప్పుడు పడిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున 'నా సామిరంగ' 12 రోజుల వసూళ్లను మీరే చూడండి!
పండుగ లాంటి సినిమాతో:కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా.. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'నా సామిరంగ'. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్:నాగార్జున 'నా సామిరంగ' సినిమాకు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది.
12వ రోజు ఎంత వచ్చింది?:సంక్రాంతి కానుకగా రూపొందిన 'నా సామిరంగ' సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాటిని నిలబెట్టుకుంటూ ఈ చిత్రం మంచి స్పందనను అందుకుని.. టార్గెట్‌ను కూడా చేరుకుంది. అయితే, రెండో వారం నుంచి ఈ చిత్రం డౌన్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 12వ రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

12 రోజుల్లో ఎంత వచ్చింది?:12 రోజుల్లో 'నా సామిరంగ' మూవీకి తెలుగులో భారీ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.83 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.44 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.62 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, గుంటూరులో రూ. 1.46 కోట్లు, కృష్ణాలో రూ. 1.24 కోట్లు, నెల్లూరులో రూ. 86 లక్షలతో.. రూ. 19.25 కోట్లు షేర్, రూ. 32.05 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 19.25 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 61 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 20.75 కోట్లు షేర్‌తో పాటు రూ. 47 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా:సంక్రాంతి విడుదల అయిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లోఈ సినిమాకు రూ. 20.75 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.75 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











