Naa Saami Ranga 13 Days Collections: జాక్‌పాట్ కొట్టిన నాగ్.. అన్ని కోట్ల లాభాలు.. 10 లక్షలు వస్తే!
టాలీవుడ్‌లో ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ.. లుక్స్ పరంగానూ కుర్ర హీరోలను వెనక్కి నెడుతూ.. నవ మన్మథుడిలా దూసుకుపోతోన్నారు కింగ్ అక్కినేని నాగార్జున. అయితే, కొంత కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న ఆయన.. ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు.
ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది. అయితే, రెండో వారంలో ఇది క్రమంగా డౌన్ అవుతూ వెళ్తోంది. అయినా లాభాలను అందిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 'నా సామిరంగ' 13 రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!

నా సామిరంగతో వచ్చాడుగా: టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున హీరోగా.. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'నా సామిరంగ'. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేశారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్: నాగార్జున నటించిన 'నా సామిరంగ'కు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ అయింది.

13వ రోజు ఎంత వచ్చింది?: నాగార్జునకు ఎంతో కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌లోనే 'నా సామిరంగ' మూవీని రిలీజ్ చేశారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన భారీగా లభించింది. ఫలితంగా ఈ చిత్రం వారంలోనే టార్గెట్ చేసుకుని లాభాల బాటలో నడుస్తోంది. ఇక, 13వ రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.

13 రోజుల్లో ఎంత వచ్చింది?: 'నా సామిరంగ' మూవీకి 13 రోజుల్లో తెలుగులో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 4.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.47 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.30 కోట్లు, గుంటూరులో రూ. 1.47 కోట్లు, కృష్ణాలో రూ. 1.25 కోట్లు, నెల్లూరులో రూ. 87 లక్షలతో.. రూ. 19.52 కోట్లు షేర్, రూ. 32.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 19.52 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 20.90 కోట్లు షేర్‌తో పాటు రూ. 47 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: క్రేజీ కాంబోలో రూపొందిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లోఈ సినిమాకు రూ. 20.90 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.90 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











