Naa Saami Ranga 14 Days Collections: 19 కోట్లే రావాలి.. 2 వారాల్లో రికార్డు.. లాభాలు ఎంతో తెలిస్తే!

అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. ఇప్పటికీ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ మధ్య కాస్త స్లోగా సినిమాలు చేస్తోన్న ఆయన.. భారీ విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో 'నా సామిరంగ' మూవీని చేశాడు.

దీనికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇలా రెండు వారాల్లో ఈ మూవీ కోట్ల లాభాలను సైతం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నాగార్జున నటించిన 'నా సామిరంగ' 14 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 14 Days Worldwide Collections

నా సామిరంగ అంటూ ఎంట్రీ: కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రమే 'నా సామిరంగ'. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేశారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ క్రేజీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 14 Days Worldwide Collections

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్: నాగార్జున 'నా సామిరంగ' సినిమాకు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 14 Days Worldwide Collections

14వ రోజు ఎంత వచ్చింది?: సంక్రాంతి సీజన్‌ అంటే ఎంతో ఇష్టపడే నాగార్జున 'నా సామిరంగ' మూవీతో వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన అదిరిపోయేలా లభించింది. ఫలితంగా ఈ చిత్రం వారంలోనే టార్గెట్ చేసుకుని లాభాలను సొంతం చేసుకుంటోంది. ఇక, 14వ రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 లక్షలు షేర్‌ను వసూలు చేసుకుంది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 14 Days Worldwide Collections

14 రోజుల్లో ఎంత వచ్చింది?: 14 రోజుల్లో 'నా సామిరంగ' మూవీకి తెలుగులో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 4.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.69 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, గుంటూరులో రూ. 1.50 కోట్లు, కృష్ణాలో రూ. 1.27 కోట్లు, నెల్లూరులో రూ. 87 లక్షలతో.. రూ. 19.96 కోట్లు షేర్, రూ. 33.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 14 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 14 రోజుల్లో రూ. 19.96 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 77 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 21.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 48 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 14 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. లాభం అలా: పండుగ లాంటి కథతో వచ్చిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లోఈ సినిమాకు రూ. 21.35 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.35 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X