Naa Saami Ranga 16 Days Collections: నాగార్జున మూవీకి లాభాల పంట.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన మార్కును క్రియేట్ చేసిన హీరో కింగ్ అక్కినేని నాగార్జున. ఒకప్పుడు ఎంతో వేగంగా మూవీలు చేసిన ఆయన.. ఈ మధ్య కాలంలో స్లో అయ్యారు.
ఈ క్రమంలోనే గత సంక్రాంతికి ఆయన 'నా సామిరంగ' అనే ఫ్యామిలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం లాభాల బాటలో పయణిస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున నటించిన 'నా సామిరంగ' 16 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!

నా సామిరంగ అంటూ నాగ్: టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా సినిమానే 'నా సామిరంగ'. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేశారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ క్రేజీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేశారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్: నాగార్జున నటించిన 'నా సామిరంగ'కు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ అయింది.

16వ రోజు ఎంత వచ్చింది?: చాలా కాలంగా భారీ హిట్ కోసం చూస్తున్న నాగార్జున సంక్రాంతికి 'నా సామిరంగ' మూవీతో వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన అదిరిపోయేలా లభించింది. ఫలితంగా ఈ చిత్రం వారంలోనే టార్గెట్ చేసుకున్నా.. ఆ తర్వాత డౌన్ అవుతూ వస్తోంది. ఇక, 16వ రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 లక్షలు షేర్‌ను వసూలు చేసుకుంది.

16 రోజుల్లో ఎంత వచ్చింది?: 'నా సామిరంగ' మూవీకి 16 రోజుల్లో తెలుగులో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 4.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.68 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.74 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.35 కోట్లు, గుంటూరులో రూ. 1.53 కోట్లు, కృష్ణాలో రూ. 1.29 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో.. రూ. 20.23 కోట్లు షేర్, రూ. 33.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 20.23 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 79 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 63 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 21.64 కోట్లు షేర్‌తో పాటు రూ. 48 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: పక్కా ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో ఈ సినిమాకు రూ. 21.64 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.64 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











