Naa Saami Ranga 3 Days Collections: నా సామిరంగకు భారీ వసూళ్లు.. 3 రోజుల్లోనే ఎన్ని కోట్లు వచ్చాయంటే!
టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ హీరోలే కుర్రాళ్ల కంటే వేగంగా మూవీలు చేస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. చాలా కాలంగా ఎంతో స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయ్యారు. దీనికితోడు భారీ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగ్ 'నా సామిరంగ' అనే చిత్రంతో సంక్రాంతి పోటీలోకి వచ్చారు. దీనికి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా బాగానే వస్తోంది. దీంతో వసూళ్లు కూడా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున 'నా సామిరంగ' 3 రోజుల కలెక్షన్లను చూసేయండి!
Recommended Video

నా సామిరంగతో నాగ్ ఎంట్రీ:అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ తెరకెక్కించిన ఫ్యామిలీ సినిమానే 'నా సామిరంగ'. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్:నాగార్జున 'నా సామిరంగ' మూవీకి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది.
3వ రోజు ఎంత వచ్చింది?:'నా సామిరంగ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 96 లక్షలు, సీడెడ్‌లో రూ. 58 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 50 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి.. రూ. 3.31 కోట్లు షేర్, రూ. 5.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజుల్లో ఎంత వచ్చింది?:'నా సామిరంగ' మూవీకి తెలుగులో 3 రోజుల్లో మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.67 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.39 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 51 లక్షలతో.. రూ. 11.54 కోట్లు షేర్, రూ. 18.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 11.54 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 12.39 కోట్లు షేర్‌తో పాటు రూ. 25 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లోఈ సినిమాకు రూ. 12.39 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.61 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











