Naa Saami Ranga 5 Days Collections: నా సామిరంగ ఇవేం కలెక్షన్లు.. అన్ని కోట్లు వస్తే నాగార్జునకు హిట్
తెలుగు చిత్ర పరిశ్రమలో కుర్ర హీరోల కంటే సీనియర్ స్టార్లే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో ఒక్కరు మాత్రమే ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయ్యారు. ఆయనే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.
ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఆయన 'నా సామిరంగ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతోంది. మరి 'నా సామిరంగ' 5 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి మరి!

నా సామిరంగ అంటూ నాగ్: అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ రూపొందించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమానే 'నా సామిరంగ'. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్: నాగార్జున 'నా సామిరంగ' చిత్రానికి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది.

5వ రోజు ఎంత వచ్చింది?: 5వ రోజు 'నా సామిరంగ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 1.53 కోట్లు షేర్, రూ. 2.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజుల్లో ఎంత వచ్చింది?: 'నా సామిరంగ' మూవీకి 5 రోజుల్లో తెలుగులో మంచి స్పందన లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.54 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.07 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 98 లక్షలు, గుంటూరులో రూ. 1.19 కోట్లు, కృష్ణాలో రూ. 98 లక్షలు, నెల్లూరులో రూ. 70 లక్షలతో.. రూ. 15.58 కోట్లు షేర్, రూ. 25.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 15.58 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 55 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 47 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 16.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 28.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లోఈ సినిమాకు రూ. 16.60 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.40 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











