Naa Saami Ranga 6 Days Collections: నాగ్ సినిమాకు ఊహించని వసూళ్లు.. ఇంకెంత వస్తే హిట్ అవుతుందంటే!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న సీనియర్ హీరోల్లో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. అయితే, గతంలో ఏకధాటిగా సినిమాలు చేసిన ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త నెమ్మదించారు. మళ్లీ ఇప్పుడు స్పీడు పెంచి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు.
ఇలా ఇప్పుడు నాగార్జున 'నా సామిరంగ' అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. అయితే, ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. మరి 'నా సామిరంగ' 6 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!

పక్కా పండగ సినిమాతో నాగ్: టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రమే 'నా సామిరంగ'. విజయ్ బిన్నీ రూపొందించిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్: నాగార్జున నటించిన 'నా సామిరంగ'కు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ అయింది.

6వ రోజు ఎంత వచ్చింది?: 'నా సామిరంగ' మూవీకి 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ తగ్గిపోతూనే ఉంది. ఫలితంగా నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.01 కోట్లు షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజుల్లో ఎంత వచ్చింది?: 6 రోజుల్లో 'నా సామిరంగ' మూవీకి తెలుగులో మంచి స్పందన లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.80 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.06 కోట్లు, గుంటూరులో రూ. 1.24 కోట్లు, కృష్ణాలో రూ. 1.05 కోట్లు, నెల్లూరులో రూ. 74 లక్షలతో.. రూ. 16.59 కోట్లు షేర్, రూ. 27.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 16.59 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 60 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 49 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 17.68 కోట్లు షేర్‌తో పాటు రూ. 34 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లోఈ సినిమాకు రూ. 17.68 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.32 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











