Naa Saami Ranga 7 Days Collections: 19 కోట్లు రావాలి.. వారంలో ఊహించని విధంగా.. మూవీ హిట్టేనా అంటే!
నటనకు నటన, హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు కింగ్ అక్కినేని నాగార్జున. సంక్రాంతికి ఎప్పుడు వచ్చినా సక్సెస్ సాధిస్తూ వస్తున్న ఆయన.. ఈసారి 'నా సామిరంగ' అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు.
ఈ చిత్రానికి మొదట్లోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఇలా వారం రోజుల్లోనే ఈ సినిమా ఊహించని విధంగా కొన్ని కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో నాగార్జున 'నా సామిరంగ' 7 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!

ఈసారి పండగ నా సామిరంగ: కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రమే 'నా సామిరంగ'. విజయ్ బిన్నీ రూపొందించిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్: క్రేజీ కాంబోలో వచ్చిన 'నా సామిరంగ'కు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది.

7వ రోజు ఎంత వచ్చింది?: 7వ రోజు 'నా సామిరంగ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ మళ్లీ తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 22 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 91 లక్షలు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

7 రోజుల్లో ఎంత వచ్చింది?: 'నా సామిరంగ' మూవీకి 7 రోజుల్లో తెలుగులో మంచి స్పందన లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.37 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు, గుంటూరులో రూ. 1.30 కోట్లు, కృష్ణాలో రూ. 1.11 కోట్లు, నెల్లూరులో రూ. 78 లక్షలతో.. రూ. 17.50 కోట్లు షేర్, రూ. 28.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 రోజుల్లో రూ. 17.50 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 52 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 18.67 కోట్లు షేర్‌తో పాటు రూ. 37 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లోఈ సినిమాకు రూ. 18.67 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 33 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











