Naa Saami Ranga 8 Days Collections: అన్ని కోట్ల టార్గెట్ ఔట్.. 2వ సినిమాగా రికార్డు.. లాభం ఎంతంటే!

టాలీవుడ్‌లోని చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన చాలా స్లోగా మూవీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే 'నా సామిరంగ' అనే మూవీతో వచ్చారు. ఈ చిత్రానికి మొదట్లోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ మంచిగానే వస్తోంది. ఇలా ఈ సినిమా ఊహించని విధంగా వసూళ్లను రాబట్టి టార్గెట్‌ను చేరుకుంది. ఈ నేపథ్యంలో నాగార్జున 'నా సామిరంగ' 8 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

నా సామిరంగ అంటూ నాగ్:టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, విజయ్ బిన్నీ తెరకెక్కించిన సినిమానే 'నా సామిరంగ'. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 8 Days Worldwide Collections

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్:'నా సామిరంగ' సినిమాకు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ అయింది.

8వ రోజు ఎంత వచ్చింది?:'నా సామిరంగ' మూవీకి 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ మళ్లీ పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.03 కోట్లు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 8 Days Worldwide Collections

8 రోజుల్లో ఎంత వచ్చింది?:8 రోజుల్లో 'నా సామిరంగ' మూవీకి తెలుగులో మంచి స్పందన లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.52 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.21 కోట్లు, గుంటూరులో రూ. 1.39 కోట్లు, కృష్ణాలో రూ. 1.18 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలతో.. రూ. 18.53 కోట్లు షేర్, రూ. 30.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 17.50 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 55 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 19.78 కోట్లు షేర్‌తో పాటు రూ. 44 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie 8 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. లాభం అలా:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లోఈ సినిమాకు రూ. 19.78 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 78 లక్షలు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

టాలీవుడ్‌లో 2వ సినిమాగా:అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ తెరకెక్కించిన 'నా సామిరంగ' సినిమాకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం 8 రోజుల్లోనే టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. తద్వారా 2024లో విజయం సాధించిన రెండో చిత్రంగా ఇది నిలిచింది. ఈ లిస్టులో 'హనుమాన్' మూవీ మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X