Naa Saami Ranga 9 Days Collections: నాగార్జున జాక్‌పాట్.. అప్పుడే అన్ని కోట్లు.. లాభం ఎంతో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా హవాను చూపిస్తూ వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. గతంలో కంటే ఈ మధ్య కాలంలో స్పీడ్ తగ్గించినా.. ఎన్నో ప్రయోగాలు మాత్రం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది. ఇలా ఈ సినిమా ఊహించని విధంగా వసూళ్లను రాబట్టి లాభాల బాటలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున 'నా సామిరంగ' 9 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

పండగలాంటి సినిమాతో నాగ్: అక్కినేని నాగార్జున - విజయ్ బిన్నీ కాంబినేషన్‌లో రూపొందిన పండగలాంటి సినిమానే 'నా సామిరంగ'. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్: నాగార్జున 'నా సామిరంగ' సినిమాకు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది.

9వ రోజు ఎంత వచ్చింది?: 9వ రోజు 'నా సామిరంగ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ బాగా తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 38 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ వచ్చింది.
9 రోజుల్లో ఎంత వచ్చింది?: 9 రోజుల్లో 'నా సామిరంగ' మూవీకి తెలుగులో భారీ స్పందన లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.74 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.57 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.58 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 1.43 కోట్లు, కృష్ణాలో రూ. 1.21 కోట్లు, నెల్లూరులో రూ. 84 లక్షలతో.. రూ. 18.91 కోట్లు షేర్, రూ. 31.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 18.91 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 72 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 58 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 20.21 కోట్లు షేర్‌తో పాటు రూ. 45 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: అదిరిపోయే కాన్సెప్టుతో వచ్చిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లోఈ సినిమాకు రూ. 20.21 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.21 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











