Naa Saami Ranga Closing Collections: నాగార్జునకు జాక్‌పాట్.. 19 కోట్ల మూవీకి భారీగా.. లాభాలు ఎంతంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలకు మాత్రమే మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వారిలో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. సుదీర్ఘ కాలంగా ఇదే రీతిలో సినిమాలు చేస్తూ వస్తోన్న ఆయన.. ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీగా లభించాయి. ఇలా ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకుని లాభాలను అందుకుంది. ఈ నేపథ్యంలో నాగార్జున నటించిన 'నా సామిరంగ' క్లోజింగ్ వసూళ్లను మీరే చూసేయండి!
నా సామిరంగతో వచ్చిన నాగ్:కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 'నా సామిరంగ'. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ క్రేజీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్:నాగార్జున 'నా సామిరంగ' సినిమాకు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 15.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది.
అలాంటి టాక్‌తో రెస్పాన్స్:భారీ హిట్ కోసం వేచి చూస్తున్న అక్కినేని నాగార్జున సంక్రాంతికి 'నా సామిరంగ' మూవీతో వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో పాటు రివ్యూలు కూడా మంచిగానే వచ్చాయి. దీనికి అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా నాగార్జున చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా వారంలోనే చేరుకుని సత్తా చాటుకుంది.

16 రోజుల్లో ఎంత వచ్చింది?:'నా సామిరంగ' మూవీకి ఫుల్ రన్‌లో తెలుగులో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 4.99 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.75 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.36 కోట్లు, గుంటూరులో రూ. 1.57 కోట్లు, కృష్ణాలో రూ. 1.29 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో.. రూ. 20.30 కోట్లు షేర్, రూ. 33.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 20.30 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 63 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి రూ. 21.72 కోట్లు షేర్‌తో పాటు రూ. 48 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా:కుటుంబ కథతో రూపొందిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో ఈ సినిమాకు రూ. 21.72 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.72 కోట్లు లాభాలు కూడా లభించాయి.


Click it and Unblock the Notifications











