Naa Saami Ranga Day 1 Collections: నాగార్జున మూవీకి దిమ్మతిరిగే వసూళ్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఇప్పటికీ అదే ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. తనదైన సినిమాలు చేస్తూ రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు భారీ హిట్ కోసం చూస్తోన్న ఈ సీనియర్ హీరో 'నా సామిరంగ' అనే చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచారు. దీనికి మంచి టాక్ లభించింది. కానీ, ప్రేక్షకుల స్పందన మాత్రం ఊహించని విధంగానే వచ్చినట్లు చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో నాగార్జున 'నా సామిరంగ' ఫస్ట్ డే కలెక్షన్లను మీరే చూసేయండి!

Recommended Video

Naa Saami Ranga Collections దిమ్మతిరిగే వసూళ్లు.. మొదటి రోజు ఎంత ? Nagarjuna | FilmiBeat Telugu

నా సామిరంగ అంటూ ఎంట్రీ:ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే 'నా సామిరంగ'. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie Day 1 Worldwide Collections

నాగార్జున మూవీ ప్రీ బిజినెస్:'నా సామిరంగ' మూవీకి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.20 కోట్లు బిజినెస్ అయింది.

టాక్‌తో సంబంధం లేకుండా:మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'నా సామిరంగ' మూవీ ఆదివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. కానీ, దానికి ఏమాత్రం సంబంధం లేకుండా రెస్పాన్స్ ఓ మోస్తరుగానే వచ్చింది. దీంతో ఈ చిత్రం మొదటి రోజు ఆశించిన రీతిలో వసూళ్లను రాబట్టలేకపోయినట్లు విశ్లేషకులు వెల్లడించారు.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie Day 1 Worldwide Collections

తొలి రోజు ఎంత వచ్చింది?
'నా సామిరంగ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 85 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 50 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి.. రూ. 4.30 కోట్లు షేర్, రూ. 6.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు రూ. 4.30 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 20 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 4.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie Day 1 Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు వెంకటేష్ సినిమాకు రూ. 4.70 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.30 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X