Naa Saami Ranga Day 2 Collections: నా సామిరంగ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్... 2వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

అక్కినేని నాగార్జున.. వయసు 64.. లుక్ మాత్రం యంగ్ కుర్రాడు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ... స్టార్ హీరోగా తన హవాను చూపిస్తున్నాడు కింగ్ నాగార్జున. అయితే ఆయన నటించిన తాజా చిత్రం నా సామి రంగ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా.. సంక్రాంతి బరిలో నిలువగా.. పర్వాలేదనిపించుకుంటుంది. ఇక ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ఈ స్టోరీలో చూద్దాం.

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మాస్ ఎంటర్ టైనర్ 'నా సామిరంగ' మూవీ. అషికా రంగనాథ్ నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించింది.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్ నటించగా... ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి రూపొందించారు.

Recommended Video

Naa Saami Ranga Boxoffice మైండ్ బ్లోయింగ్ Collections...2వ రోజు ఎన్నిఎన్ని కోట్లు ? | Filmibeat

Nagarjuna Starrer Naa Saami Ranga Movie Day 2 Worldwide Collections

'నా సామిరంగ' మూవీకి నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.22 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.01 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2.01 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.23 కోట్లు బిజినెస్ అయింది.

మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'నా సామిరంగ' మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకుంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ లభించింది. కానీ, దానికి ఏమాత్రం సంబంధం లేకుండా రెస్పాన్స్ ఓ మోస్తరుగా నమోదు అవుతుంది. దీంతో ఈ చిత్రం రెండు రోజుల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie Day 2 Worldwide Collections

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ తెరకెక్కించిన 'నా సామిరంగ' మూవీకి రెండో రోజు బాగానే కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో నా సామిరంగ చిత్రానికి నైజం రూ.1.47కోట్లు, సీడెట్ రూ. 76లక్షలు, వైజాగ్ రూ. 56 లక్షలు, ఈస్ట్ రూ. 54 లక్షలు, వెస్ట్ రూ.34 లక్షలు, కృష్ణ రూ. 26లక్షలు, గుంటూరు రూ.41లక్షలు, నెల్లూరు రూ.20లక్షలు వసూలు చేసింది. ఇక రెండో రోజు నా సామి రంగ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్లు రాబట్టింది.

ఇక నాగార్జున నటించిన ఈ మాస్ అండ్ ఎంటర్ టైనర్ చిత్రానికి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కలుపుకుని రూ.8.88 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 17.8 కోట్లు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X