The Ghost day 2 Collections: నాగార్జున మూవీ నెగిటివ్ టాక్‌ ఘోస్ట్ రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోయే సీనియర్ హీరోల్లో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టిన కింగ్ నాగార్జున సుధీర్గ కాలంగా తన హవా చూపుతున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల బంగార్రాజు మూవీతో సక్సెస్ కొట్టిన నాగార్జున తాజాగా ది ఘోస్ట్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్ గా విడుదలైంది. ఈ నేపథ్యంలో నాగార్జున 'ది ఘోస్ట్' సినిమా రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా!

హీరోయిన్ గా సోనాల్ చౌహన్..

హీరోయిన్ గా సోనాల్ చౌహన్..

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రమే 'ది ఘోస్ట్'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..

కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ జరిగింది.

రెండో రోజు ఎంతొచ్చిందంటే ?

రెండో రోజు ఎంతొచ్చిందంటే ?

'ది ఘోస్ట్ ' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ డే తక్కువ రెస్పాన్స్ రాగా రెండో రోజు దాని ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 76 లక్షల షేర్, రూ. 1.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు..

తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు..

ఏపీ, తెలంగాణలో రెండు రోజుల్లో 'ది ఘోస్ట్' చిత్రం అంతగా కలెక్షన్లు రాబట్టనట్టే కనిపిస్తుంది. నైజాంలో రూ. 81 లక్షలు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 47 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. రూ. 2.76 కోట్లు షేర్, రూ. 5.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

వరల్డ్ వైడ్ గా వచ్చింది ఎంతంటే..

వరల్డ్ వైడ్ గా వచ్చింది ఎంతంటే..

ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజుల్లో చాలా తక్కువగా రూ. 2.76 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 35 లక్షలు వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని రెండు రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' రూ. 3.36 కోట్లు షేర్‌, రూ. 6.35 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఎంతంటే..

టార్గెట్ ఎంతంటే..

విడుదలకు ముందే అంచనాలు ఏర్పరచుకున్న 'ది ఘోస్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. దీనికి రెండు రోజుల్లో రూ. 3.36 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 18.64 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X