The Ghost Official Collections: అన్ని కోట్ల నష్టాల దిశగా ఘోస్ట్.. 22 కోట్లకు వారంలో వచ్చింది ఇంతే!
ఆరు పదల వయసులోనూ హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులకు ఫిదా చేస్తూ.. కుర్రాళ్లకు ధీటుగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరో కింగ్ అక్కినేని నాగార్జున. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. కొంత కాలంగా పెద్దగా సక్సెస్‌లను ఖాతాలో వేసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎలాగైనా భారీ హిట్‌ను అందుకోవాలన్న లక్ష్యంతో 'ది ఘోస్ట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ వారం రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

ఘోస్ట్‌గా మారిపోయిన నాగార్జున
అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ మూవీనే 'ది ఘోస్ట్'. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా చేసింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించాడు.

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ అయింది.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'ది ఘోస్ట్ ' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 7వ రోజు వసూళ్లు మరింత పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 వేలు, వెస్ట్ గోదావరిలో రూ. 80 వేలు, గుంటూరులో రూ. 20 వేలు, కృష్ణాలో రూ. 70 వేలు, నెల్లూరులో రూ. 10 వేలతో కలిపి రూ. 8 లక్షలు షేర్, రూ. 15 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

వారంలో ఎక్కడ? ఎంతొచ్చింది?
'ది ఘోస్ట్ ' మూవీకి వారంలో ఏపీ, తెలంగాణలో వసూళ్లు అంతగా రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 1.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 57 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 76 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 4.05 కోట్లు షేర్, రూ. 7.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 4.05 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 52 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని 7 రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' రూ. 4.92 కోట్లు షేర్, రూ. 9.25 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
నాగార్జున - సోనాల్ చౌహాన్ నటించిన 'ది ఘోస్ట్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 4.92 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 17.08 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

భారీ నష్టాల దిశగా సాగుతోందిగా
అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీ వారంలో చాలా దారుణమైన వసూళ్లనే రాబట్టింది. ఓ స్టార్ హీరో రేంజ్‌లో కలెక్షన్లు రాలేదనే చెప్పుకోవాలి. ఇక, రెండో వారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 'ది ఘోస్ట్' మూవీకి దాదాపు రూ. 15 కోట్లకు పైగానే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుందని అంచనా.


Click it and Unblock the Notifications











