The Ghost Official Collections: 22 కోట్ల టార్గెట్.. 2 వారాల్లో ఇంతే.. అన్ని కోట్ల నష్టం తప్పదా!

సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌తో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. అయితే, ఈ మధ్య కాలంలో భారీ విజయాన్ని అందుకోవడంలో విఫలం అవుతోన్న ఆయన.. ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇటీవలే 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' 2 వారాల రిపోర్టును చూడండి!

ఘోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున

ఘోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున

అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ మూవీనే 'ది ఘోస్ట్'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌‌గా నటించింది.

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా వచ్చిన 'ది ఘోస్ట్'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ జరిగింది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

దసరా పండుగను పురస్కరించుకుని విడుదలైన 'ది ఘోస్ట్' చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టాక్ ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై చూపించింది. ఫలితంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్ంయలో 14వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఇది కేవలం రూ. 7 లక్షలు మాత్రమే రాబట్టింది.

2 వారాల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?

2 వారాల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?

2 వారాల్లో 'ది ఘోస్ట్'కు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు తక్కువగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 89 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 42 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో.. రూ. 5.00 కోట్లు షేర్, రూ. 8.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో 2 వారాల్లో రూ. 5.00 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 36 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని 14 రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ రూ. 5.98 కోట్లు షేర్‌, రూ. 11.05 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'ది ఘోస్ట్' చిత్రానికి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి రూ. 5.98 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 16.02 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X