twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

The Ghost Official Collections: నాగార్జునకు భారీ దెబ్బ.. 3వ రోజే ఇంత తక్కువా.. ఇంకెంత రావాలంటే!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళ్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. గతంలో మాదిరిగా ఈ మధ్య కాలంలో అంతగా ఫామ్‌లోని లేని ఆయన.. సంక్రాంతికి వచ్చిన 'బంగార్రాజు'తో విజయాన్ని అందుకున్నారు. ఈ జోష్‌తోనే ఇప్పుడు ఈ అక్కినేని హీరో 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో దసరా కానుకగా విడుదలైన ఈ మూవీకి కలెక్షన్లు అంతగా రావట్లేదు. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' 3 రోజుల కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

ఘోస్ట్‌గా మారిపోయిన నాగార్జున

ఘోస్ట్‌గా మారిపోయిన నాగార్జున

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'ది ఘోస్ట్'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం ఇచ్చారు.

కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ అయింది.

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'ది ఘోస్ట్ ' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 3వ రోజు వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 44 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట
విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

3 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?

3 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?

'ది ఘోస్ట్ ' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 3 రోజుల్లో తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 95 లక్షలు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 57 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో కలిపి రూ. 3.20 కోట్లు షేర్, రూ. 5.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 3.20 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 42 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని 3 రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' రూ. 3.92 కోట్లు షేర్‌, రూ. 7.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!
లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ది ఘోస్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 3.92 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 18.08 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

స్టార్ హీరోకు ఇంత ఘోరంగానా

స్టార్ హీరోకు ఇంత ఘోరంగానా

అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీకి మొదటి రోజు మంచి వసూళ్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, కేవలం రూ. 2.45 కోట్లు మాత్రమే ఇది వసూలు చేసింది. ఆ తర్వాత పెరుగుతాయని భావించినా.. కోటి రూపాయలు కూడా రాలేదు. ఇక, మూడో రోజు మరీ దారుణంగా సగానికి సగం పడిపోయాయి. ఇదే కంటిన్యూ అయితే ఈ సినిమా నష్టాలను చవి చూడాల్సిందే.

English summary
Akkineni Nagarjuna Did The Ghost Movie Under Praveen Sattaru Direction. This Movie Collect 3.92 Cr in 3 Days.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X